English   

మార్చ్ 2న చ‌ర‌ణ్ అక్క పెళ్లి..

ram charan
2018-02-21 11:12:56

అదేంటి.. రామ్ చ‌ర‌ణ్ అక్క పెళ్లి ఇప్పుడు జ‌ర‌గ‌డం ఏంటి..? ఎప్పుడో అయిపోయింది క‌దా.. అయినా ఉన్న‌ది చెల్లి నిహారిక మాత్ర‌మే క‌దా.. అనుకుంటున్నారా..? ఇక్క‌డే ఉంది చిన్న ట్విస్ట్. ఇక్క‌డ అక్కంటే సొంతం అక్క కాదు. సినిమా అక్క‌. బ్రూస్లీలో చ‌ర‌ణ్ కు అక్క‌గా న‌టించిన కృతిక‌ర్భందాను గుర్తు చేసుకోండి. అప్పుడేదో ఆఫ‌ర్లు లేక‌ అక్క‌గా మారిపోయింది కానీ ఈమె బేసిగ్గా హీరోయినే. ఏడేళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నా ఇప్ప‌టికీ హీరోయిన్ గా నిల‌దొక్కుకోలేక‌పోయింది ఈ భామ‌. అందాల ఆర‌బోత‌కు సిద్ధంగా ఉన్నా.. అక్క‌ పాత్ర‌ల‌కు సెటిలైపోయినా కృతికి అదృష్టం మాత్రం క‌లిసి రావ‌డం లేదు. చివ‌రికి ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ భామ జాత‌కం మార్చ‌లేదు. ఇక ఇప్పుడు కృతి ముందున్న ఏకైక ల‌క్ష్యం అందాల ఆర‌బోత‌. గ్లామ‌ర్ షో లో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌ట్లేదు కృతిక‌ర్బందా. ఇప్ప‌టికీ హీరోయిన్ గా వెలిగిపోదామ‌నే ప్ర‌య‌త్నాలు  చేస్తూనే ఉంది ఈ బ్యూటీ.

ఓ వైపు అక్క పాత్ర‌లు చేస్తూనే మ‌రో వైపు హీరోయిన్ రోల్స్ కోసం కూడా ప్ర‌య‌త్నాలు ఆప‌డం లేదు కృతి క‌ర్బందా. ఆ మ‌ధ్య ఓ హాట్ ఫోటోషూట్ తో తానింకా హీరోయిన్ మెటీరియ‌ల్ నే అంటూ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ఓ హింట్ వ‌దిలేసింది కృతి. ఆ త‌ర్వాతే బాలీవుడ్ లో రాజ్ 4 సినిమాలో ఇమ్రాన్ హ‌ష్మీ, గౌర‌వ్ అరోరాల‌తో రొమాన్స్ చేసింది. ఈ సినిమాలో అయితే ఏకంగా హాట్ సీన్స్, లిప్ లాక్స్ తో రెచ్చిపోయింది. అయినా అదృష్టం మాత్రం క‌లిసి రాలేదు. రాజ్ 4 ఫ్లాప్ తో కృతి జాత‌కం మార‌లేదు. అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కిణిలా మారిపోయింది కృతిక‌ర్భందా. బాలీవుడ్ లో ఏ ఈవెంట్ కు వ‌చ్చినా ఉల్లిపొర కంటే ప‌లుచ‌గా ఉండే దుస్తుల్లో క‌నిపిస్తుంది. తాజాగా వీరీ కి వెడ్డింగ్ సినిమాలో న‌టిస్తుంది కృతిక‌ర్బంధా. విచిత్రంగా పెళ్లి సినిమాల‌కు కృతికి ఏదో సంబంధం ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. ఈ మ‌ధ్యే షాదీ కో జ‌రూర్ ఆనా సినిమాలో న‌టించింది కృతి. ఇప్పుడు వీరీ కి వెడ్డింగ్ అంటుంది. ఈ సినిమా మార్చ్ 2న విడుద‌ల కానుంది. మొత్తానికి ఈ పెళ్లిళ్లైనా కృతిక‌ర్బంధాను కాపాడ‌తాయా..?

More Related Stories