English   

రామ్ చరణ్ సర్ ప్రైజింగ్ గిఫ్ట్ .. 

Ram Charan-samantha

మెగా పవర్ స్టార్ మెస్మరైజ్ చేస్తున్నాడు. రంగస్థలం టీజర్ తో ఆశ్చర్యపరిచిన చరణ్.. ఆ తర్వాత రెండు లిరికల్ సాంగ్స్ తో సూపర్బ్ అనిపించాడు. సమంత టీజర్ కూడా అద్భుతం అనిపించింది. కానీ ఈ ఇద్దరూ కలిసి కనిపించలేదు. రెండు పాటల్లో చెరొకటీ ఉన్నా.. విజువల్ గా లేవవి. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం మరో సాంగ్ రిలీజ్ చేయబోతోంది రంగస్థలం టీమ్. రంగమ్మ మంగమ్మ అంటూ సాగే ఈ టీజింగ్ సాంగ్ లో అదిరిపోయే ట్విస్ట్ ను రెడీ చేసింది రంగస్థలం టీమ్. ఈ పాటలో చరణ్, శామ ల కెమిస్ట్రీ ఆశ్చర్యపరుస్తుందనే వార్తలు ఇప్పటికే హల్చల్ చేస్తున్నాయి. నిజమే.. వచ్చిన రెండు పాటలతో పోల్చుకుంటే ఈ పాటలో ఖచ్చితంగా మరింత స్పెషాలిటీ కనిపించాలి. కారణం.. ఇద్దరూ కలిసి ఉండే పాట కాబట్టి. అయితే ఇప్పటి వరకూ వచ్చిన లిరికల్ సాంగ్స్ మాత్రమే కాదు.. ఈ పాటలో మరో స్పెషాలిటీ చూపించబోతోంది టీమ్.. 

రంగస్థలంకు సంబంధించి రెండు టీజర్స్ వచ్చాయి. రెండు పాటలు వచ్చాయి. రేపు సాయంత్రం 6గంటలకు మంగమ్మ రంగమ్మ అంటూ మరో పాట రాబోతోంది. అయితే దీనితో పాటు ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేయబోతున్నారు చరణ్ అండ్ సుకుమార్. అదేంటో తెలుసా.. వీలైతే రేపు పాటతో పాటు ఓ టీజర్ కూడా విడుదల చేస్తారు. యస్.. మీరు చదివింది కరెక్టే. పాటతో పాటు టీజర్ కూడా వచ్చే అవకాశాలు 90శాతం ఉన్నాయంటున్నారు. ఒకవేళ టీజర్ సాధ్యం కాకపోయినా పాటతోనూ మరింత సర్ ప్రైజింగ్ ఇవ్వబోతున్నారు. అంటే పాటలో ఇద్దరూ కలిసి ఉండ విజువల్స్ ఉంటాయన్నమాట. పాటను బట్టి చూస్తే ఖచ్చితంగా ఇది ఇద్దరి మధ్యా గిల్లికజ్జాల్లాగా సాగే పాటనుకోవచ్చు. అంటే సమంత, చరణ్ ల కెమిస్ట్రీ ఓ రేంజ్ లో అర్థమైపోతుంది. పైగా చరణ్ చెవిటి వాడుగా, సమంత మూగమ్మాయిగా నటిస్తోంది. సో.. ఇది ఖచ్చితంగా ఫ్యాన్స్ కే కాదు.. రంగస్థలం కోసం వెయిట్ చేస్తోన్న ప్రతి ఒక్కరికీ సర్ ప్రైజింగ్ గిఫ్టే అనుకోవచ్చు..

More Related Stories