English   

రామ్ చ‌ర‌ణ్ ను ఇబ్బంది పెట్టిన పోలీసులు..

2017-04-01 06:54:19

రామ్ చ‌రణ్ ను ఏంటి.. పోలీసులు ఇబ్బంది పెట్ట‌డ‌మేంటి అనుకుంటున్నారా..? విన‌డానికి విచిత్రంగా ఉన్నా.. న‌మ్మ‌డానికి క‌ష్టంగా ఉన్నా ఇదే నిజం. మెగా వార‌సున్ని నిజంగానే పోలీసులు ఇబ్బంది పెట్టారు. అస‌లు విష‌యం ఏంటంటే చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం సుకుమార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఎప్రిల్ 2 నుంచి ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది. ఈ చిత్ర తొలి షెడ్యూల్ ను గోదావ‌రి జిల్లాల్లో ప్లాన్ చేసాడు సుకుమార్. కానీ అక్క‌డ ప‌ర్మిష‌న్లు ఇవ్వ‌డానికి పోలీసులు నిరాక‌రించారు. ఆ త‌ర్వాత పొల్లాచ్చికి ఆ షెడ్యూల్ మార్చాడు. కానీ అక్క‌డ సెట్ అవ్వ‌క క‌ర్ణాట‌క‌లోని ఓ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు సుకుమార్. అది కూడా న్యాచుర‌ల్ గా లేద‌ని మ‌ళ్లీ గోదావరి జిల్లాల్లోకే వ‌చ్చాడు. కానీ పోలీసులు అక్క‌డికి వ‌చ్చే జ‌నాన్ని కంట్రోల్ చేయ‌లేమ‌ని ప‌ర్మిష‌న్ నో అన్నారు. చివ‌రికి పెద్ద స్థాయి వ్య‌క్తులను ఇందులో ప్ర‌వేశ పెట్టిన త‌ర్వాత గానీ ప‌ని జ‌ర‌గ‌లేదు. మొత్తానికి ఈ ప‌ర్మిష‌న్ తెచ్చుకోడానికి చ‌ర‌ణ్ కు మాత్రం చుక్క‌లు క‌నిపించాయని ఇండ‌స్ట్రీలో వార్త‌లు వినిపిస్తున్నాయి. 

More Related Stories