English   

బోయ‌పాటికి చ‌ర‌ణ్ ట‌ఫ్ టార్గెట్..

Ramcharan-boyapati

మెగా ప‌వ‌ర్ స్టార రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. అంత‌కు ముందు ధ్రువ కూడా హిట్ అయింది. ఈ రెండూ అత‌ను అంత‌కు ముందు ట‌చ్ చేయ‌ని జాన‌ర్స్. అందుకే ఇప్పుడు మ‌ళ్లీ త‌న‌దైన శైలిలో యాక్ష‌న్ ప్యాక్డ్ ఎంట‌ర్టైన‌ర్ తో రాబోతున్నాడు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఊర‌మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్స్ తెర‌కెక్కించ‌డంలో ఎక్స్ ప‌ర్ట్ అయిన బోయ‌పాటి డైరెక్ష‌న్ లో ప్ర‌స్తుతం సినిమా చేస్తున్నాడు చ‌ర‌ణ్. లేటెస్ట్ గా భ‌ర‌త్ అనేనేనుతో టాలీవుడ్ లోకి బ్లాక్ బ‌స్ట‌ర్ ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తోందీ సినిమాలో.  ప్ర‌స్తుతం బ్యాంకాక్ షెడ్యూల్ లో ఉందీ మూవీ. అక్క‌డ కొన్ని యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రిస్తున్నారు.  

అయితే ఈ సినిమా షూటింగ్ టైమ్ లో రామ్ చ‌ర‌ణ్ ను బోయ‌పాటి బాగా ఇబ్బంది పెడుతున్నాడ‌ని టాక్. నిజానికి ఈ సినిమా త‌ర్వాత చ‌ర‌ణ్.. రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించే సినిమా చేయాలి. అది ద‌స‌రా త‌ర్వాత మొద‌లుపెట్ట‌బోతున్నారు. ఆ లోగానే ఈ సినిమా పూర్తి కావాల‌నే టార్గెట్ పెట్టాడ‌ట చ‌ర‌ణ్‌. అందుకోసం కాస్త ఇబ్బందైనా బోయ‌పాటి మ‌రింత హార్డ్ వ‌ర్క్ తో సినిమా ఫినిష్ చేయాల‌ని చూస్తున్న‌ట్టు చెబుతున్నారు. 

మ‌రోవైపు ఈ సినిమాను ద‌స‌రాకే విడుద‌ల చేయాల‌నే టార్గెట్ కూడా పెట్టుకున్నారు. కానీ అది సాధ్యం కాక‌పోవ‌చ్చంటోంది టీమ్. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ త‌న కాల్షీట్స్ కు సంబంధించి కొన్ని సార్లు హ్యాండ్ ఇచ్చాడు. దానివ‌ల్ల మ‌ళ్లీ ఆ సీన్స్ చిత్రీక‌రించాలి. పైగా ఇత‌ర ఆర్టిస్టులంద‌రినీ మ‌ళ్లీ తీసుకోవాలి. మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నిర్మిస్తోన్న సైరా సినిమా ప‌నులు కూడా నిర్మాత‌గా చూసుకోవాలి. ఈ కారణంగానే ద‌స‌రాకు విడుద‌ల సాధ్యం కాక‌పోవ‌చ్చంటున్నారు. అయినా స‌రే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సినిమా ద‌సరాకే విడుద‌ల‌య్యేలా చూడాలంటూ రామ్ చ‌ర‌ణ్, బోయపాటికి ఓ ట‌ఫ్ టార్గెట్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

More Related Stories