English   

రానా పెళ్లిలో సందడి చేసిన రామ్ చరణ్ దంపతులు..

Ram Charan Upasana
2020-08-08 23:24:57

రానా దగ్గుబాటి పెళ్లి సందడి ఓ రేంజ్ లో ఉంది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ఈయన పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చాలా తక్కువ మంది హాజరయ్యారు. కోవిడ్ కారణంగా కేవలం 40 మందిని మాత్రమే ఈ పెళ్లికి పిలిచారు. తన కొడుకు పెళ్లి ఇంత సింపుల్ గా జరుగుతున్నందుకు తనకు కూడా బాధగా ఉందని తెలిపాడు సురేష్ బాబు. అయినా కూడా తప్పడం లేదని.. పరిస్థితులు అలా వచ్చాయంటున్నాడు ఈయన. ఇక ఈయన పెళ్లి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఉన్నంత మంది అద్భుతంగా జరిగింది దగ్గుబాటి వారసుడి పెళ్లి. ఇదిలా ఉంటే ఈ పెళ్లికి రామ్ చరణ్ దంపతులు కూడా హాజరయ్యారు. రానాకు చిన్నప్పటి నుంచి కూడా ప్రాణ స్నేహితుడు రామ్ చరణ్. అందుకే ఆయనకు ఆహ్వానం అందింది. ఉపాసన, చరణ్ వచ్చి కొత్త దంపతులను ఆశీర్వదించారు. వీళ్ళతో పాటు బయటి వాళ్లలో శర్వానంద్ కు మాత్రమే ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది. నాగచైతన్య దంపతులు కూడా వచ్చారు. అయితే రానా పెళ్లి నేరుగా కాకపోయినా వర్చువల్ రియాలిటీలో చూసే ఆప్షన్ ఇచ్చారు. 

More Related Stories