English   

దైవ‌భ‌క్తిలో మునిగిపోయిన చ‌ర‌ణ్.. 

ramcharan
2018-07-26 12:04:30

పైకి క‌నిపించ‌డు కానీ రామ్ చ‌ర‌ణ్ లో ఆద్యాత్మిక భావాలు ఎక్కువే. ఎందుకంటే ఎప్పుడు వీలు దొరికినా కూడా గుళ్లు గోపురాలు అంటూ తిరుగు తుంటాడు ఈ హీరో. అప్పుడ‌ప్పుడూ త‌మ ఇంట్లోనే ఆద్యాత్మిక గురువుల‌తో ప్ర‌వ‌చ‌నాలు కూడా చెప్పించుకుంటాడు మెగా వార‌సుడు. ఆ మ‌ధ్య ఓ గురూజి వ‌చ్చి మెగా కుటుంబం అంద‌రికీ త‌న బోధ చేసాడు. ఇప్పుడు కూడా చ‌ర‌ణ్ ఈ ప‌నుల్లోనే ఉన్నాడు. బోయ‌పాటి శీను సినిమా షూటింగ్ లో కాస్త గ్యాప్ దొర‌క‌డంలో నిజామాబాద్ లోని దోమ‌కొండ సంస్థానంలోని దేవాయాల‌నికి వ‌చ్చాడు రామ్ చ‌ర‌ణ్.

అస‌లు అక్క‌డికి ఆయ‌న వ‌చ్చిన‌ట్లు కూడా చాలా మందికి తెలియ‌దు. అంత సింపుల్ గా వ‌చ్చి కొన్ని పూజ‌లు చేసి వెళ్లాడు చ‌ర‌ణ్. తెల్ల‌టి దుస్తుల్లో కామ‌న్ మ్యాన్ గా వ‌చ్చాడు ఈ హీరో. అక్క‌డి పూజారుల‌తో పాటు గుళ్లో అలా కూర్చుని ఉన్న చ‌ర‌ణ్ ను చూసి ఆహా చ‌ర‌ణ్ ఎంత మారిపోయాడ‌బ్బా అనుకుంటున్నారంతా. పైగా బ‌య‌టికి వ‌చ్చి అక్క‌డి ప‌నివాళ్ల‌తో కూడా ఫోటోలు దిగాడు మెగా వార‌సుడు. అన్న‌ట్లు ఈ దేవాల‌యానికి చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కుటుంబ‌మే రాజ సంస్థానాధీశులు. వాళ్ల ఆధీనంలోనే ఈ కోట‌తో పాటు గుడి కూడా ఉంది. 

More Related Stories