English   

రామ్ చ‌ర‌ణ్.. రాజా బ‌హ‌ద్దూర్..

Ram-Charan-s-Next-Fixed-As-Bahaddur
2017-05-03 01:45:39

రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం సుకుమార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మ‌ధ్యే తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమా. రేప‌ల్లె అనే వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మే రెండో వారంలో మొద‌లు కానుంది. స‌మంత ఇందులో హీరోయిన్. ఈ చిత్రం సెట్స్ పై ఉండ‌గానే.. అప్పుడే మ‌రో సినిమాపై దృష్టి పెట్టాడు చ‌ర‌ణ్. ధృవ స‌క్సెస్ తో ఈ మ‌ధ్య రీమేక్ సినిమాల‌పై బాగా మ‌న‌సు ప‌డుతున్నాడు మెగా హీరో. ప్ర‌స్తుతం క‌న్న‌డ‌లో సూప‌ర్ హిట్టైన బ‌హ‌ద్దూర్ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు చ‌ర‌ణ్.

ఈ సినిమాను తెలుగులో మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ రీమేక్ చేయబోతున్నారు. ఇప్ప‌టికే రైట్స్ తీసుకున్నార‌ని తెలుస్తోంది. తెలుగులో ఈ క‌థ‌కు చ‌ర‌ణ్ ఐతే  స‌రిగ్గా సూట్ అవుతాడ‌ని భావిస్తున్నాడు అల్లు అర‌వింద్. ఇందులో హీరో తండ్రిగా యాక్ష‌న్ కింగ్ అర్జున్ న‌టించే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు అల్లు అర్జున్ వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌నున్నాడ‌ని తెలుస్తోంది. మొత్తానికి సుకుమార్ సినిమా సెట్స్ పై ఉండ‌గానే.. త‌ర్వాతి సినిమాకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు మెగా వార‌సుడు.

More Related Stories