English   

కేసీఆర్ పై సినిమా తీయడం పక్కా.. ఆర్జీవి

 Ram Gopal Varma
2021-04-16 15:10:57

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. అంతే కాకుండా అవి థియేటర్ లో రిలీజ్ అవుతున్నాయా.? ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయా అన్నది కూడా అర్థం కాకుండా పోయింది. అంటే సినిమా రిలీజ్ అయ్యింది కూడా తెలియడం లేదు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఉన్న వర్మ ఇప్పుడు ట్విట్టర్ లో పాపులర్ అయ్యారు గాని సినిమాల విషయంలో ఫ్లాప్ డైరెక్టర్ గా మిగిలారు. అయితే ఆయనకు ఉన్న ఫాలోయింగ్ తో ఎప్పుడు ఎవరిపై సినిమా తిస్తారన్న ఆసక్తి మాత్రం ఉంటుంది. ఇప్పటికే వర్మ ఏపీలో కొంతమంది నాయకులపై సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 

అయితే గతంలో ఆర్జీవి కేసీఆర్ పై సినిమా తిస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు మొదలు పెట్టలేదు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం పై స్పందించారు. యాంకర్ కేసీఆర్ పై సినిమా తిస్తానని చెప్పారు. ఎప్పుడు తిస్తారని ప్రశ్నించగా..కచ్చితంగా కేసీఆర్ పై సినిమా ఉంటుందని..త్వరలోనే ఉంటుందని అన్నారు. అంతే కాకుండా "ఏపీ లో జరుగుతున్న రాజకీయాలపై కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమా తీశారని..తెలంగాణలో రెడ్ల రాజ్యంలో దొరల బిడ్డలు అనే సినిమా తీసే అంత ఉందా అని ప్రశ్నించారు. దానికి ఆర్జీవి సమాధానం ఇస్తూ ఏపీలో రాజకీయ పరిస్థితులు వేరని ఇక్కడ పరిస్థితులు వేరని అన్నారు. ఇక్కడ అలా తీసే అవకాశం లేదని చెప్పారు.

More Related Stories