English   

వర్మ నువ్వు మామూలోడివి కాదురా నాయనా..

 Ram Gopal Varma
2020-07-07 08:51:20

అగ్గిపుల్ల.. సబ్బుబిల్ల.. కుక్కపిల్ల కాదేదీ కాదు కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు వర్మను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను కూడా ఇప్పుడు తను వాడేసుకుంటున్నాడు. దీని విజృంభన చూసి ఇప్పటికే దీనిపై ఓ పాట విడుదల చేసిన వర్మ మొన్నటికి మొన్న ఏకంగా సినిమాను తీసుకొచ్చేలా ప్లాన్ చేసాడు. లాక్ డౌన్ కారణంగా అంతా ఇంట్లోనే లాక్ అయిపోతే ఈయన మాత్రం తన పని తాను చేసుకుంటున్నాడు. అసలు ఎక్కడ్నుంచి షూటింగ్ చేస్తున్నాడు.. ఎలా చేస్తున్నాడు అనేది కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. అప్పుడే సినిమాను సిద్ధం చేసాడు. ట్రైలర్ కూడా విడుదల చేసాడు. కరోనా వైరస్ అంటూ ఈ సినిమాకు పేరు కూడా పెట్టాడు. ఇందులో వర్మ ఆస్థాన నటులే ఎక్కువగా కనిపిస్తున్నారు. అసలు వర్మకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయబ్బా అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. 

ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు.. ఇప్పటికే క్లైమాక్స్, కరోనా వైరస్, నేక్డ్ లాంటి సినిమాలు చేసి ఆన్ లైన్ లోనే విడుదల చేసి సొమ్ము చేసుకున్నాడు వర్మ. ఇప్పుడు మరో సినిమా కూడా అనౌన్స్ చేసాడు. దాని పేరు థ్రిల్లర్. ఈ సినిమాను కూడా పూర్తి చేసాడు.. త్వరలోనే విడుదల చేస్తున్నానని చెప్పాడు ఈ దర్శకుడు. మొత్తానికి వర్మ చేస్తున్న సినిమాలు చూసి అంతా షాక్ అవుతున్నారు. అసలు ఈయనకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి.. ఇంత వేగంగా సినిమాలు ఎలా చేస్తున్నాడంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈయన్ని ఇలాగే వదిలేస్తే నెలకు కాదు.. వారానికి ఓ సినిమా చేసి ఆన్ లైన్ రిలీజ్ చేస్తాడు ఆర్జీవీ. 

More Related Stories