English   

వర్మకు శ్రద్ధాంజలి.. పీక్స్‌కు చేరిన పైత్యం..

Ram Gopal Varma
2019-12-14 14:07:45

వర్మ ఎప్పుడేం చేసినా కూడా పిచ్చిగానే అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మరోసారి తన పైత్యాన్ని చూపించాడు ఈ దర్శకుడు. ఈయనకు ఈయనే శ్రద్ధాంజలి పెట్టుకున్నాడు. చనిపోయిన వాళ్లు కదా అలా చేసుకునేది అనుకుంటున్నారా..? కానీ వర్మ మాత్రం డిఫెరెంట్. ఈయన పోటోకు దండేసుకుని ఇప్పుడు శ్రద్ధాంజలి ఉన్న ఫోటోను ఆయనే ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు సంచలన దర్శకుడు. కమ్మరాజ్యంలో సినిమా తర్వాత తెలుగు తమ్ముళ్లకు వర్మకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. దాంతో ఈయన చనిపోయినట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు కొందరు. దాన్ని కూడా తన సినిమాకు ప్రమోషన్ గా వాడుకుంటున్నాడు ఆర్జీవీ. అసలు ఇంతగా పిచ్చేంట్రా బాబూ అంటూ ఆయన్ని పట్టుకుని ప్రశ్నిస్తున్నారు కొందరు. కానీ ఎవరేం అన్నా కూడా తన రూట్ మాత్రం మారదంటున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేయడంతో వర్మ ఇప్పటికీ కాదు.. ఎప్పటికీ మారడని అర్థమైపోతుంది. మీ లీడర్ ను పట్టుకోడానికి అతి త్వరలో దెయ్యమై వస్తున్నానని పోస్ట్ చేసాడు వర్మ. ఈయన పైత్యం చూసి అయ్యో పాపం అని కొందరు అంటుంటే.. వర్మ నువ్వు తోపురా బాబూ అంటూ మరికొందరు అంటున్నారు. ఈయన అమ్మరాజ్యంలో కలెక్షన్లు కూడా పర్లేదనిపిస్తున్నాయి.

More Related Stories