English   

పవన్ కళ్యాణ్ కు కరోనా..ఫేక్ అంటూ ఆర్జీవి ట్విట్టర్ కూతలు

Pawan Kalyan
2021-04-17 12:05:23

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిన్న శుక్రవారం జనసేన టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పవన్ ప్రస్తుతం ఫామ్ హౌస్ లో చికిత్స పొందుతున్నారని. ఖమ్మం కు చెందిన వైద్యులు..మరియు అపోలో నుండి ఒక బృందం వెళ్లి పవన్ కు చికిత్స చేస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. అయితే పవన్ అంటే గిట్టని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో పవన్ కల్యాణ్ బెడ్ పై ఉన్న ఫోటోను షేర్ చేస్తూ వరుస ట్వీట్ లు చేసారు. 

"ఒక కనిపించని పురుగు పవన్ కళ్యాణ్ ను ఇలా పడుకోబెట్టిందంటే అసలు హీరో అనే వస్తువు ప్రపంచంలో ఉన్నట్టా లేనట్టా..చెప్పండి యువర్" అంటూ వర్మ  పోస్టులు మొదలెట్టారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కు కరోనా రావడం ఫేక్ అన్నట్టుగా వర్మ ట్వీట్ లు చేశారు. పవన్ కళ్యాణ్ ఫొటోలోని ఆర్ట్ డైరెక్షన్ లో ఒక తప్పు ఉందని దాన్ని ఆర్ట్ డైరెక్టర్ బాబు సిరీల్ తో చెప్పించాలని రాజమౌళి ని కోరారు. 

అంతే కాకుండా ఫోటోలో ఉన్న మిస్టేక్ ఎంటో చెబితే ఒక గిఫ్ట్ ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. అంతే కాకుండా " ఫేక్ అని నేను అనట్లేదు వేరే హీరోల ఫ్యాన్స్ అంటున్నారు." అంటూ వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. ఇక వర్మ ట్వీట్ లపై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నీకు రాధా ఈ కరోనా..ఎప్పుడూ కారుకూతలు కూస్తుంటావ్ అని కామెంట్స్ చేస్తున్నారు.

More Related Stories