English   

పవన్ కళ్యాణ్‌ను వర్మ మామూలుగా కెలకడం లేదుగా..

Ram gopal varma
2020-07-12 15:53:49

'పవర్ స్టార్' సినిమా అనౌన్స్ చేసిన క్షణం నుంచి వరసగా పోస్టర్స్ విడుదల చేసి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాడు వర్మ. ఇవన్నీ చూసి అభిమానులు కూడా మండి పడుతున్నారు. ఎందుకు ఇప్పుడు పవన్ ను కెలుకుతున్నావ్ వర్మ అంటూ ఆయన్నే అడుగుతున్నారు. దానికి వర్మ కూడా సమాధానం ఇచ్చాడు. తన సినిమా ఎవర్నీ తక్కువ చేసి చూపించేది కాదని చెప్తున్నాడు ఆర్జీవీ. పవర్ స్టార్ సినిమాలో ప్రధాన పాత్రధారి గడ్డి కోస్తున్న ఫోటోతో పాటు ఆవులకు మేత వేస్తున్న ఫోటో.. దాంతో పాటు మరికొన్ని ఫోటోలు కూడా విడుదల చేసాడు వర్మ. ఇవన్నీ చూసిన తర్వాత అభిమానులకు ఎక్కడో కాలిపోతుంది. ఇవన్నీ చూసిన తర్వాత ''వ్యవసాయాన్ని ఇష్టపడే వ్యక్తులను నేను ప్రేమిస్తున్నాను.. జంతువులను ప్రేమించే వారిని కూడా ప్రేమిస్తాను.. నా పవర్ స్టార్ టీ తాగుతూ పుస్తకాలు చదువుతాడు'' అని చెప్పుకొచ్చాడు వర్మ. 

అంతే కాకుండా ''కొందరి వ్యక్తుల వల్ల POWER STAR పై అనవసరమైన వివాదం తలెత్తుతోంది.. ఈ చిత్రం ఎవరినీ తక్కువ చేసి చూపించబోదని నేను చెప్పాలనుకుంటున్నాను.. ఇది నేను లార్డ్ బాలాజీపై ప్రమాణం చేసి చెప్తున్నాను''' అని ట్వీట్ చేసాడు ఈ దర్శకుడు. ఇది ఇంకా రచ్చకు దారి తీస్తుంది. ఇక లోగోలో గ్లాస్ ఉంచడం పై వివరణ ఇస్తూ.. ''టీ గ్లాస్ ను POWER STAR లోగోలో ఉంచడానికి కారణం తన సినిమాలో హీరో తరచూ టీ తాగుతుంటాడు. అంతేకాని అది ఏ రాజకీయ కారణంగానో పెట్టింది కాదు.. SHIVA లోగోలో నేను సైకిల్ చైన్ ని ఉపయోగించాను ఎందుకంటే హీరో తరచూ దానితో కొడతాడు కాబట్టి.. దట్స్ ఇట్!'' అని ట్వీట్ చేసాడు. ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు కావాలనే రచ్చ చేయడానికి ఫిక్స్ అయిపోయావ్ చెయ్ ఇంక ఏం చేస్తాం అంటున్నారు నెటిజన్లు. 

More Related Stories