English   

వర్మ సవాల్ టాలీవుడ్ అసలు పట్టించుకోనట్టు ఉందే..

rgv
2020-05-28 19:59:27

లాక్ డౌన్ సమయంలో అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. బయటి పనులు అన్నీ మానేసి ఇంట్లో ఏమైనా పనులుంటే చూసుకోండి అంటూ ప్రభుత్వమే చెప్పింది. కానీ వాటిని కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నారు రాంగోపాల్ వర్మ. ఖాళీగా కూర్చోవడం తన డిక్షనరీలో లేదు అంటూ మరోసారి నిరూపించాడు. ఈ సమయంలోనే అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ రెండు సినిమాలు పూర్తి చేశాడు వర్మ. ప్రపంచంలోనే కరోనా వైరస్ పై తొలి సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే ట్రైలర్ కూడా విడుదల చేశాడు. అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ ట్రైలర్ విడుదల చేసిన తర్వాత రాంగోపాల్ వర్మ చేసిన సవాల్ మాత్రం కొంత తేడాగా ఉంది. టాలీవుడ్ లో ఉన్న అగ్ర దర్శకులు అందరికీ ఈయన సెటైర్ వేశాడు. లాక్ డౌన్ సమయంలో మీరు వంట చేసుకుంటూ అంట్లు తోముకుంటూ కూర్చుంటే నేను మాత్రం ఒక సినిమా తీసేసాను అంటూ ట్వీట్ చేసాడు వర్మ. దీన్ని కనీసం మన హీరోలు దర్శకులు పట్టించుకున్నట్టు కూడా కనిపించడం లేదు. నీ దారి నీదే మా దారి మాదే అన్నట్లు వర్మను పూర్తిగా తన ఖర్మకు వదిలేసారు. ఆయన సవాల్ కూడా ఎవరూ పట్టించుకోలేదు. కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు.

More Related Stories