English   

రామ్ గోపాల్ వర్మను రౌండప్ చేశారు

RGV

అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. రామ్ గోపాల్ వర్మ విషయంలో ఇది మరోసారి తేలిపోయింది. కొన్ని రోజుల క్రితం జీఎస్టీకి సంబంధించి వ్యతిరేక అనుకూల చర్చల్లో రామ్ గోపాల్ వర్మ మరీ శ్రుతి మించిపోయాడు. సోషల్ యాక్టివిస్ట్ లపై అనుచిత కమెంట్స్ చేశాడు. దేవీ అనే సామాజిక కార్యకర్తనైతే ఏకంగా ఆమెతో పోర్న్ మూవీస్ చేస్తానని అసభ్యంగా మాట్లాడాడు. దీంతో దేవీ వర్మపై కేస్ పెట్టింది. ఇవే కాక అతను తీసిన జీఎస్టీ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. కేస్ నమోదు చేసిన పోలీస్ లు వర్మకు సమన్లు పంపించారు. కానీ అతను అటెంట్ కాలేదు. ఈ లోగా విషయం సీరియస్ అయింది. దీంతో దిగొచ్చాడు. ఇవాళ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో పోలీస్ విచారణకు హాజరయ్యాడు.

పోలీస్ లు వర్మకు పలు ప్రశ్నలు వేశారు. వాటిలో అన్నిటికీ ఆయన ఆన్సర్ చెప్పాడట. కానీ తను జీఎస్టీ అనే మూవీ తీసింది పోలండ్ దేశంలో యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసింది యూకే నుంచి కాబట్టి ఈ దేశ చట్టాలు తనకు వర్తించవు అనే వాదనలు చేశాడట. కానీ పోలీస్ లు వర్మను జీఎస్టీకి సంబంధించి చాలా ప్రశ్నలే వేశారట. ఎక్కడ షూట్ చేశారు.. డబ్బులు ఎవరిచ్చారు.. ఈ సినిమా తీయడానికి రీజన్స్ ఏంటీ..? అప్ లోడ్ చేయడానికి ఎంతైంది.. చేశాక ఎంతొచ్చింది.. అందులో నీ వాటా ఎంత.. అందులో నటించిన మియా మాల్కోవాకు ఎంతిచ్చారు వంటి ప్రశ్నలతో వర్మను ఉక్కిరిబిక్కిరి చేశారట. ఫైనల్ గా అతని ల్యాప్ ట్యాప్ ను పోలీస్ ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలనే హామీ తీసుకుని వదిలేశారు. అయితే విచారణ సందర్భంగా తన లాయర్ తో వచ్చిన వర్మను ఆ ఇద్దరిని మాత్రమే పోలీస్ లు విచారణ వరకూ అనుమతించారు. ఇంకెవరినీ లోపలికి రానీయలేదు. మొత్తంగా తను చేసిన అతి ఆలస్యంగా అయినా తన మెడకు చుట్టుకోవడం ఖాయం అంటున్నారు కొందరు పోలీస్ పెద్దలు. అయితే కొందరు న్యాయవాదులు మాత్రం ఈ కేస్ స్ట్రాంగ్ గా నిలవదేమో అంటున్నారు. ఏదేమైనా ఇన్నాళ్లూ తనకెదురే లేదనుకున్న వర్మ ఫైనల్ గా పోలీస్ స్టేషన్ వరకూ రావడం కొంత వరకూ దేవీ సక్సస్ అనే చెప్పాలి. 
 

More Related Stories