English   

రామ్-ప్ర‌వీణ్.. ఎక్క‌డ క‌లిసింద‌బ్బా..?

Ram-praveen-Sattaru
2018-03-24 16:42:33

రామ్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 13 ఏళ్లైపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌యోగం అనే మాట‌ను కూడా త‌న కంపౌండ్ లోకి రానివ్వ‌లేదు. ప‌క్కా రొటీన్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. త‌గిలిన‌వి హిట్లు అవుతున్నాయి.. లేక‌పోతే ఎప్ప‌ట్లాగే ఫ్లాప్ అవుతున్నాయి. ఇప్పుడు చేస్తోన్న సినిమా కూడా ప‌క్కా రొటీన్ సినిమానే. త్రినాథ‌రావ్ న‌క్కిన‌తో హ‌లో గురు ప్రేమకోస‌మే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం సెట్స్ పై ఉన్న‌పుడే ప్ర‌వీణ్ స‌త్తార్ తో ఓ సినిమాకు సై అన్నాడు ఈ కుర్ర హీరో. ఇది ప‌క్కా అడ్వంచ‌ర‌స్ డ్రామా అని తెలుస్తుంది. సినిమా ఇండ‌స్ట్రీలో విజ‌యంతోనే ప‌ని. ఇక్క‌డ స‌త్తా చూపిస్తే చాలు హీరోలే వెంట ప‌డుతుంటారు. ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తార్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఈ ద‌ర్శ‌కున్ని మొన్న‌టి వ‌ర‌కు ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. పేరులోనే స‌త్తా ఉన్నా సినిమాల్లో ఉండ‌ద‌ని లైట్ తీసుకున్నారు. కానీ గ‌రుడ‌వేగతో ఈయ‌న స‌త్తా తెలిసింది. ఈ చిత్రం భారీ బ‌డ్జెట్ తో రూపొందింది. కేవ‌లం రాజ‌శేఖ‌ర్ ఉన్నందుకే సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా ఫ్లాప్ అయింది కానీ మ‌రో హీరో ఉండుంటే హిట్ అయ్యుండేది. అయితే మాత్రం గ‌రుడ‌వేగ‌తో ప్ర‌వీణ్ స‌త్తార్ స‌త్తా ఏంటో తెలిసింది మ‌న హీరోల‌కు. 

ఎల్ బి డ‌బ్ల్యూ లాంటి డిఫెరెంట్ స్టోరీతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈ కుర్ర ద‌ర్శ‌కుడు.. రొటీన్ ల‌వ్ స్టోరీ, చంద‌మామ క‌థ‌లు లాంటి సినిమాల‌తో క్రేజ్ తెచ్చుకున్నాడు. గుంటూర్ టాకీస్ తో మ‌నోడు  సెన్సేష‌న్ సృష్టించాడు. గ‌రుడ‌వేగ‌తో ప్ర‌వీణ్ కు మంచి గుర్తింపు వ‌చ్చింది. ఇలాంటి యాక్ష‌న్ మూవీ చూసి చాలా కాలం అయిందంటూ మాట్లాడుకుంటున్నారు ఇండ‌స్ట్రీ జ‌నాలు. సాక్షాత్తు రాజ‌మౌళి కూడా గ‌రుడ‌వేగ‌పై పాజిటివ్ క‌మెంట్స్ చేసాడు. మొత్తానికి గ‌రుడ‌వేగ త‌ర్వాత ప్ర‌వీణ్ ఏం చేస్తాడో అనే దానిపై ఇండ‌స్ట్రీలో ఆస‌క్తి మొద‌లైంది. దీనికి స‌మాధానంగా ఇప్పుడు రామ్ పేరు వినిపిస్తుంది. కుర్ర హీరో రామ్ కు ఇప్ప‌టికే ప్ర‌వీణ్ ఓ క‌థ చెప్పాడ‌ని.. దానికి రామ్ నుంచి కూడా ఓకే అనే స‌మాధానమే వ‌చ్చింద‌ని తెలుస్తుంది. ఇప్పుడు రామ్ క‌మిట్ అయిన త్రినాథ‌రావ్ న‌క్కిన సినిమా పూర్తికాగానే ప్ర‌వీణ్ సినిమా మొద‌ల‌వుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి చూడాలిక‌.. ప్ర‌వీణ్ స‌త్తార్ స‌త్తా రామ్ తో ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories