English   

తెలంగాణా ఇంటర్ సూసైడ్స్...రామ్ సెన్సేషనల్ ట్వీట్ 

Ram Pothineni
2019-04-24 10:38:51

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ పోతినేని తనదైన శైలిలో స్పందించాడు. ఇంటర్‌ను అసలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని పేర్కొన్నాడు. ఇంటర్ పాసవడమే జీవితం అనుకుంటే, తానసలు ఇంటరే పూర్తిచేయలేదన్నాడు. విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ఇంటర్ బోర్డు హత్యలుగా అభివర్ణించిన రామ్ జీవితంలో అవబోయేదానికి, చేయబోయేదానికి ఇంటర్‌ను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని, ఆ మాటకొస్తే తానసలు ఇంటరే పూర్తిచేయలేదని పేర్కొన్నాడు. మరోపక్క ఈరోజు సచిన్ పుట్టినరోజు కావడంతో రామ్ స్పెషల్ గా విషెస్ చెప్పారు. ఆత్మహత్యలు చేసుకుంటోన్న ఇంటర్ విద్యార్థులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ‘పార్క్‌లో కూర్చుని బిస్కెట్లు తినే పిల్లలకి ఎలా చెప్పినా వింటారు. బెడ్‌రూమ్‌ లాక్ వేసుకుని లైఫ్ ఎలా రా అనుకునే పిల్లలకి నిజాలు ఇలా చెప్తేనే వింటారు. ఇంటర్ కూడా పూర్తి చేయని, దేశం గర్వించదగిన వ్యక్తి సచిన్ టెండూల్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అని రామ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.  

More Related Stories