English   

రామ్ తో ముచ్చటగా మూడో సారి ?

Ram
2019-05-20 14:34:40

ఎనర్జిటిక్ హీరో రామ్ కి ఈ మధ్య కాలంలో మంచి హిట్స్ ఏవీ పడలేదు. దీంతో ఆయన ఆశలన్నీ పూరీ కాంబినేషన్లో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ మీదే పెట్టుకున్నాడు. అయితే అయన మరో ప్రాజెక్ట్ ఒప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రామ్ హీరోగా వచ్చిన సినిమా ‘నేను శైలజ’. మంచి లవ్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ సాధించడమే కాక రామ్‌ కెరియర్లో ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఉన్నది ఒకటే జిందగీ తెరకెక్కినా ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం మరో సినిమా వీరిద్దరూ కలిసి చేయడానికి చూస్తున్నారట. తమిళ్‌ లో ఘనవిజయం సాధించిన ‘థడం’ సినిమాను వీరిద్దరూ తెలుగులో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారని, తమిళంలో సూపర్ హిట్టందుకున్న ఈ సినిమా కథ రామ్ కి బాగా నచ్చిందని అందుకే తనకి లవ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ తోనే ఈ సినిమా చేయాలని డిసైడయ్యాడని అంటున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వస్తున్నా సినిమా టాకీ పూర్తయ్యాక లేట్ కాకుండా ఈ సినిమా మొదలు పెడతారని అంటున్నారు.
 

More Related Stories