English   

శాస్త్రిగారు సిందేస్తున్నట్టున్నారే...

Ramajogayya-Sastry
2018-04-12 18:52:47

పాటల రచయితగా తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న రామజోగయ్య శాస్త్రిలో చిన్నపాటి నటుడు కూడా ఉన్నాడు. గతంలో కొన్ని సినిమాల్లో కేమియో అప్పీరియన్స్ లు కూడా ఇచ్చాడీ లిరిసిస్ట్. సిరివెన్నెల తర్వాత ఆ స్థాయి రచయిత అయ్యే అవకాశాలున్నాయి అని జోగయ్యగారికి పేరుంది. మొదట్నుంచీ దర్శకుడు కొరటాల శివతో మంచి రిలేషన్ అండ్ బాండ్ మెయిన్టేన్ చేస్తోన్న ఆయనకు శివ ప్రతి సినిమాలోనూ పాటలు రాసే అవకాశం వస్తుంది. జనతా గ్యారేజ్ సింగిల్ కార్డ్ తర్వాత ఇప్పుడు భరత్ అనేనేనుకూ అదే స్థాయి పాటలు రాశాడు శాస్త్రిగారు. 

ప్రస్తుతం ఈపాటలు ట్రెండింగ్ లోనే ఉన్నాయి. ఈనేపథ్యంలో రామజోగయ్య శాస్త్రి ఓ కొత్త గెటప్ తో కనిపించాడీ మధ్య. మెడలో రుద్రాక్ష మాల, తలపాగాతో ఓ జాతర లుక్ లో ఉన్నాడు. దీన్ని ఆయన భరత్ అనేనేను సినిమాలో ఓ పాటలో స్టెప్పులు వేయబోతున్నాడనే విషయం చెప్పకనే చెప్పినట్టున్నారు. స్టెప్పులంటే మరీ ఓ రేంజ్ లో కాకపోయినా హీరోను పొగుడుతూ వచ్చే రెండు మూడు లైన్లలో ముందు వరసలో నిలబడ్డ ఒక వర్గానికినాయకుడులా జోగయ్యగారు కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈయనలో పాటగాడు, నటుడే కాదు.. మాంచి ఆటగాడు కూడా ఉన్నాడన్నమాట.
 

More Related Stories