English   

అదిరిపోయిన కొమరం భీమ్.. రామ్ చరణ్ వాయిస్ అద్భుతం..

RRR
2020-10-22 11:58:24

రాజమౌళి మరోసారి అద్భుతం చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆరు నెలల కింద మన అల్లూరి అంటూ రామ్ చరణ్ ను పరిచయం చేశాడు. మధ్యలో కరోనా బ్రేకులు పడి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ టీజర్ విడుదలైంది. అక్టోబర్ 22న కొమరం భీం 119వ జయంతిని పురస్కరించుకుని ఈ టీజర్ విడుదల చేశారు. కొమరం భీమ్ గా ఈయన అద్భుతంగా సరిపోయాడు. దానికి తోడు రామ్ చరణ్ వాయిస్ లోని గాంబీర్యం టీజర్ కు మరింత వన్నె తీసుకొచ్చింది.


వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి..
నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయి..
వాడి పొగరు ఎగిరే జెండా..
వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ..
వాడు భూతల్లి చనుబాలు తాగి మన్యం ముద్దుబిడ్డ..
నా తమ్ముడు గోండు బెబ్బులి..
కొమరం భీమ్ అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగులు అదిరిపోయాయి. రామరాజు వాయిస్‌తో భీంకు సంబంధించిన వీడియోని విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ లుక్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది. మరోవైపు నందమూరి అభిమానులతో పాటు మెగా అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు ముఖ్యంగా టీజర్ లో విజువల్స్  హైలైట్ అయ్యాయి. టీజర్ ఇలా విడుదల అయిందో లేదో అప్పుడే రికార్డుల మోత మొదలైంది. 2021లో సినిమా విడుదల కానుంది. 
 

More Related Stories