English   

చిరంజీవి ఆ అప్పు తీర్చేసాడా..? 

chiranjeevi
2018-07-22 15:23:44


మెగాస్టార్.. తెలుగు సినిమా చ‌క్ర‌వ‌ర్తి.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌కుటం లేని మ‌హారాజు.. ఇలాంటి పేర్లు అన్నీ ఉన్న చిరంజీవి ఓ నిర్మాత‌కు బాడీ ప‌డ్డాడు. కెరీర్ మొద‌ట్లో బాగా ఇబ్బంది ప‌డుతున్న రోజుల్లో చిరు కుటుంబానికి సాయం చేసాడు ఓ నిర్మాత‌. ఈ విష‌యాన్ని గుర్తు పెట్టుకుని మ‌రీ అంద‌రి ముందు చెప్ప‌డం నిజంగా రామ్ చ‌ర‌ణ్ గొప్ప‌త‌నం. తాజాగా ఈయ‌న హ్యాపీవెడ్డింగ్ ఆడియో వేడుక‌కు వ‌చ్చాడు. అక్క‌డ అంత మంది ఉన్నారు.. వేలాది మంది అభిమానులు టీవీల్లో చూస్తుంటారు అయినా కూడా త‌న తండ్రికి సంబంధించిన ఈ విష‌యాన్ని అందరి ముందు ఒప్పుకున్నాడు ఈ హీరో. 

కుటుంబం గ‌డ‌వ‌టానికి చాలా ఇబ్బందిగా ఉన్న రోజుల్లో చిరంజీవికి 5 వేల సాయం చేసాడు ఎమ్మెస్ రాజు వాళ్ల నాన్న అయ్య‌ప్ప రాజు. అప్ప‌ట్లో ఆయ‌న మంచి నిర్మాత‌. త‌మ కుటుంబానికి సాయం చేసిన విష‌యాన్ని ఈ మ‌ధ్యే త‌న‌కు నాన్నగారు చెప్పార‌ని చెప్పాడు రామ్ చ‌ర‌ణ్. అప్పుడు ఆయ‌న చేసిన సాయం చిన్న‌ది కూడా కాద‌న్నాడు చ‌ర‌ణ్. ఇప్పుడు హ్యాపీవెడ్డింగ్ వేడుక‌కు కూడా తాను రావ‌డానికి కార‌ణం ఎమ్మెస్ రాజు గారే కానీ నిహారిక కాద‌న్నాడు ఈ మెగా వార‌సుడు. ఎమ్మెస్ రాజు త‌న‌యుడు సుమంత్ అశ్విన్ ఇందులో హీరోగా న‌టించాడు. జులై 28న విడుద‌ల కానుంది ఈ చిత్రం. అన్నీ బాగానే ఉన్నాయి గానీ ఇంత‌కీ ఆ అప్పు చిరంజీవి తీర్చాడో లేదో మాత్రం చెప్ప‌లేదు చ‌ర‌ణ్. తీర్చే ఉంటాడా.. తీర్చేసే ఉంటాడులెండీ..!

More Related Stories