English   

భ‌ర‌త్ కు సిట్టిబాబు గ‌ట్టి స‌వాల్.. 

charan-mahesh
2018-04-03 17:15:58

ఇప్ప‌టి వ‌ర‌కు ఓవ‌ర్సీస్ కింగ్ ఎవ‌రు అంటే మ‌రో మాట లేకుండా మ‌హేశ్ బాబు అని చెప్పేవాళ్లు. ఇప్ప‌టికీ నాన్ బాహుబ‌లి రికార్డుల‌న్నీ మ‌హేశ్ పేరు మీదే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయ‌న మొగుడు వ‌చ్చాడు. అత‌డే రామ్ చ‌ర‌ణ్.. ఇన్నాళ్లూ చాలా సైలెంట్ గా ఉన్న చ‌ర‌ణ్.. ఒకేసారి రేస్ లోకి దూసుకొచ్చాడు. రంగ‌స్థ‌లం సినిమాతో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా మూడు రోజుల్లోనే 2.5 మిలియ‌న్.. వారంలోనే 3 మిలియ‌న్ వైపుగా అడు గులేస్తున్నాడు. ఈ దూకుడు చూసి ట్రేడ్ కూడా షాక్ అవుతుంది. అస‌లు రామ్ చ‌ర‌ణ్ సినిమాకు ఇంత‌గా ఓపెనింగ్స్ వ‌స్తాయ‌ని.. ఓ విలేజ్ డ్రామాకి అక్క‌డి ప్రేక్ష‌కులు ఇంత‌గా ఫిదా అవుతార‌ని క‌నీసం ఎవ‌రూ ఊహించ‌లేదు. కానీ ఇప్పుడు జ‌రుగుతుంది. రంగ‌స్థ‌లం సృష్టించే ఒక్కో రికార్డ్ ఇప్పుడు  భ‌ర‌త్ అనే నేనుకు స‌వాల్. ఎందుకంటే స్పైడ‌ర్.. బ్ర‌హ్మోత్స‌వం అక్క‌డ అత్యంత దారుణంగా బ‌య్య‌ర్ల‌ను ముంచేసాయి. 

ఇలాంటి స‌మ‌యంలో భ‌ర‌త్ అనే నేనుపైనే ఆశ‌లు పెట్టుకున్నాడు మ‌హేశ్. పైగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించింది కొర‌టాల శివ కావ‌డంతో శ్రీ‌మంతుడు మ్యాజిక్ మ‌ళ్లీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర జ‌రుగుతుంద‌ని న‌మ్ముతున్నాడు మ‌హేశ్ బాబు. ఓవ‌ర్సీస్ లోనూ ఇదే సీన్ రిపీట్ అయి.. శ్రీ‌మంతుడు పేరు మీదున్న 2.8 మిలియ‌న్ తో పాటు ఇప్పుడు రంగ‌స్థ‌లం సెట్ చేయ‌బోయే కొత్త రికార్డుల‌ను కూడా తుడిచేయాల‌ని చూస్తున్నాడు భ‌ర‌త్ అనే నేను. ఇప్ప‌టికైతే భ‌ర‌త్ కు టార్గెట్ ఎంతో తెలియ‌ట్లేదు. ఎందుకంటే రంగ‌స్థ‌లం ర‌చ్చ ఇప్ప‌టికీ ఆగ‌టం లేదు. వీక్ డేస్ లోనూ ర‌చ్చ అలాగే సాగుతుంది. భ‌ర‌త్ తో పాటు నా పేరు సూర్య సినిమాతో అల్లుఅర్జున్ కు కూడా పెద్ద ల‌క్ష్యాన్నే ఫిక్స్ చేసాడు చ‌ర‌ణ్. మ‌రి చూడాలిక‌.. సిట్టిబాబును దాటుకుని వ‌చ్చే ఆ మొన‌గాడు ఎవ‌రో..?

More Related Stories