English   

చరణ్ కూడా ట్విట్టర్ రీ ఎంట్రీ ఇస్తాడట

ramcharan
2020-03-25 20:40:48

రామ్ చరణ్ మిగతా తెలుగు హీరోల మాదిరిగానే ముందుగా ఒక ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశాడు. అయితే అక్కడ కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దాంతో ట్విట్టర్ కి దూరమయ్యాడు. అయితే తన అకౌంట్ ని టీమ్ రామ్ చరణ్ అనే పేరుతో మార్చి సైలెంట్ అయ్యారు. కేవలం ఫేస్ బుక్ వరకే చూసుకుంటూ గడిపేవాడు. అయితే ఇప్పుడు ఆయన మళ్ళీ ట్విట్టర్ ఎంట్రీకి రెడీ అయినట్టు చెబుతున్నారు. ఈ నెల ఇరవై ఏడు అంటే ఎల్లుండి చరణ్ పుట్టిన రోజు, ఆరోజున మళ్ళీ ట్విట్టర్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడట చరణ్. ఆరోజు తాను నటిస్తున్న ఆర్ఆర్ఆర్ కి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆ లుక్ విడుదల చరణ్ ట్విట్టర్ నుండే రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈరోజు చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఎంట్రీ ఇచ్చిన వెంటనే పెద్ద ఎత్తున ఆయనకు ఫాలోవర్స్ వచ్చేశారు.

More Related Stories