English   

ఐసియులో వ‌ర్మ‌.. కండీష‌న్ సీరియ‌స్..

RGV ICU Baahubali effect
2017-05-02 06:43:26

అదేంటి.. ఎప్పుడూ హుషారుగా ఉండే వ‌ర్మ‌కు ఏమైంది..? ఆయ‌న ఐసియులో ఉండ‌టం ఏంటి.. పైగా కండీష‌న్ కూడా సీరియ‌స్ అంటున్నారు.. ఇంత‌కీ త‌మ అభిమాన ద‌ర్శ‌కుడికి ఏమైంది అని అభిమానులు కంగారు ప‌డుతున్నారా..? అయితే ఇది మీకు కంగారు ప‌డాల్సిన విష‌య‌మే. ఎందుకంటే నిజంగానే వ‌ర్మ ఐసియులో ఉన్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే ట్విట్ట‌ర్ లో తెలిపారు. దానికి కార‌ణం భ‌యంక‌ర‌మైన జ‌ల‌సైటిస్ అనే వైర‌స్. అదేంటి.. ఇలాంటి వైర‌స్ ఒక‌టి ఉంద‌ని ఎప్పుడూ చ‌ద‌వ‌లేదు అనుకుంటున్నారా..? అవును.. దీన్ని వ‌ర్మ క‌నిపెట్టారు. ఈ వైర‌స్ త‌న‌కు సోకింద‌ని వెంట‌నే హాస్పిటల్ కు వెళ్లాడు వ‌ర్మ‌. తీరా అక్క‌డికి వెళ్తే అప్ప‌టికే అక్క‌డ ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్లు అంతా ఆ వైర‌స్ సోకి ఐసియూలో ఉన్నార‌ట‌. ఇంత‌కీ ఏంటి వైర‌స్ అంటే.. బాహుబ‌లి 2 చూసి అసూయ చెందిన ద‌ర్శ‌కులకు వ‌చ్చే వైర‌స్ ఇద‌న్నమాట‌. చూసారా.. వ‌ర్మ మాట‌ల్లో ఎంత చ‌మ‌త్కారం దాగుందో..? ఎంతైనా వ‌ర్మ మేధావ‌బ్బా..!

More Related Stories