English   

కరోనా వైరస్‌ను కూడా వదలని వర్మ..

rgv
2020-04-01 07:47:04

అగ్గిపుల్ల.. సబ్బుబిల్ల.. కుక్కపిల్ల కాదేదీ కాదు కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు వర్మను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను కూడా ఇప్పుడు తను వాడేసుకుంటున్నాడు. దీని విజృంభన చూసి దానిపై ఓ పాట విడుదల చేస్తున్నాడు వర్మ. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఎప్రిల్ 1న ఈ పాటను విడుదల చేయబోతున్నాడు వర్మ. అయితే ఇక్కడే అందరికీ ఓ అనుమానం కూడా వస్తుంది. అసలే ఎప్రిల్ 1.. అందర్నీ ఒకేసారి ఫూల్ చేయడు కదా అంటూ కొన్ని సెటైర్లు కూడా పేలుతున్నాయి. వస్తుంది పాట అని చెప్పి ఎప్రిల్ ఫూల్ అన్నా అనే రకమే వర్మ.. అందుకే అందరికీ అనుమానాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ వైరస్ విస్తరణతో ప్రపంచం ఎంతగా ఇబ్బందులు పడుతుందో.. ఎలా స్తంభించిపోయిందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఓ రకంగా కరోనాపై అందరూ ఇంట్లోనే కూర్చుని పోరాటం చేస్తున్నారు కూడా. తెలుగు హీరోలు కూడా ఓ పాటను విడుదల చేసారు. ఇప్పుడు వర్మ కూడా ఓ పాటను రెడీ చేసాడు. కనిపించని పురుగు అనే ఓ టైటిల్ తో ఈ పాటను సిద్ధం చేసాడు ఈ దర్శకుడు. ఈ సాంగ్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.

More Related Stories