English   

రాజ‌మౌళి ఆస్తిపై రామోజీరావ్ క‌న్ను..

Ramoji Rao Rajamouli
2018-06-08 07:43:24

అదేంటి.. రాజ‌మౌళి ఆస్తుల‌పై రామోజీరావ్ క‌న్నేయ‌డం ఏంటి..? ఆల్రెడీ ఈయ‌న‌కే వేల కోట్లు ఉన్నాయి క‌దా ఇప్పుడు మ‌ళ్లీ కొత్త‌గా ఇదేం ఫిట్టింగ్ అనుకుంటున్నారా..? ఇది సినిమా ఇండ‌స్ట్రీ.. ఇక్క‌డంతా పైసా మే ప‌ర‌మాత్మ‌. డ‌బ్బులుంటే కానీ ఇక్క‌డ ఏ ప‌ని జ‌ర‌గ‌దు. రాజ‌మౌళితోనూ రామోజీ రావుకు ఇప్పుడు ఆర్థిక‌ప‌ర‌మైన లావాదేవీల ద‌గ్గ‌రే తేడా వ‌చ్చింద‌నే వార్త‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయిప్పుడు. బాహుబ‌లి షూటింగ్ దాదాపు 80 శాతం ఆర్ఎఫ్సీలోనే జ‌రిగింది. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కానీ ఇక్క‌డే తెలియ‌ని విష‌యం కూడా ఉంది. దీనికోసం అప్ప‌ట్లో రామోజీరావు ప్ర‌త్యేకంగా ఏమీ ఛార్జ్ చేయ‌లేదు. దానికి బ‌దులుగా శాటిలైట్ రైట్స్ తో పాటు డిస్ట్రిబ్యూష‌న్ షేర్ కూడా ఇస్తాన‌ని అప్ప‌ట్లో రాజ‌మౌళి మాటిచ్చిన‌ట్లుగా వార్త‌లొచ్చాయి. అయితే త‌ర్వాత ఏమైందో ఏమో తెలియ‌దు కానీ హ‌క్కులు మాటీవీకి వెళ్లిపోయాయి. రామోజీరావుతో విభేదాలు మొద‌ల‌య్యాయి అని తెలుస్తుంది. 

అప్ప‌టికే రావుగారి లెక్కంతా రాజ‌మౌళి క్లియ‌ర్ చేసినా కూడా ఇప్పుడు మ‌ళ్లీ అద‌న‌పు లెక్క‌లు చెప్పి మ‌రో 90 కోట్ల బిల్ జ‌క్క‌న్న ఆఫీస్ కు రామోజీరావు పంపించాడ‌ని.. ఇది చూసి రాజ‌మౌళి కూడా షాక్ అయ్యాడ‌ని తెలుస్తుంది. అయితే ఈ లెక్కేంటో మాత్రం ఇంకా తేల‌ట్లేదు. కావాలనే ఈ మీడియా టైకూన్ రాజ‌మౌళిని టార్గెట్ చేసాడా లేదంటే నిజంగానే ఏదైనా ఆర్థిక లావ‌దేవీలు ఉన్నాయా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇక చ‌ర‌ణ్-ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ కోసం అల్యూమీనియం ఫ్యాక్ట‌రీ ద‌గ్గ‌ర 2 ఎక‌రాల స్థలాన్ని రాజ‌మౌళి లీజ్ కు తీసుకోవ‌డం కొస‌మెరుపు. ఇది చూసి రామోజీరావ్ తో ఈయ‌న‌కు వ‌చ్చిన విభేదాలు మాత్రం నిజ‌మే అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కొన్ని క‌న్ఫ‌ర్మ్ చేసుకుంటున్నాయి. చూడాలిక‌.. ఈ విష‌యం ఎక్క‌డ ఆగుతుందో..? 

More Related Stories