English   

 అల్లున్ని వ‌దిలేసిన ర‌మ్య‌కృష్ణ‌.. 

Ramya-krishna
2018-07-19 08:35:36

అవునా.. అల్లున్ని వ‌దిలేసిందా..? అస‌లు అల్లుడు వ‌చ్చేంత కూతురు ముందు ర‌మ్య‌కృష్ణ‌కు ఎక్క‌డుంది అనుకుంటున్నారా..? ఉంటారు.. సినిమా వాళ్లు క‌దా అంతా ఉంటారు. అలాగే ఇప్పుడు ర‌మ్య‌కృష్ణ‌కు కూడా కూతురు ఉంది.. అల్లుడు కూడా ఉన్నాడు. ఈమె ప్ర‌స్తుతం చాలా బిజీగా ఉంది. బాహుబ‌లి ఏ ముహూర్తంలో వ‌చ్చిందో తెలియ‌దు కానీ అప్ప‌ట్నుంచీ స్టార్ హీరోయిన్ల రేంజ్ లో కుమ్మేస్తుంది ఈ మాజీ హీరోయిన్. ప్ర‌స్తుతం మారుతి శైల‌జారెడ్డి అల్లుడు సినిమాలో అత్త పాత్ర‌లో న‌టిస్తుంది ఈ శివ‌గామి. అత్తా అల్లుళ్ల కాన్సెప్ట్ తో వ‌స్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా అను ఎమ్మాన్యువ‌ల్ న‌టిస్తుంది.

ఈమె కంటే అత్త పాత్ర‌లో న‌టిస్తున్న ర‌మ్య‌కృష్ణ ఎక్కువ పారితోషికం తీసుకుంటుండ‌టం విశేషం. ఇక ఇప్పుడు ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ పాత్ర పూర్తైపోయింది. తాజాగా షూట్ పూర్తి చేసుకుని ద‌ర్శ‌కుడు మారుతితో సెల్ఫీ కూడా ఇచ్చింది ర‌మ్య‌కృష్ణ‌. త్వ‌ర‌లోనే వ‌చ్చి డ‌బ్బింగ్ కూడా పూర్తి చేయ‌నుంది ఈ అత్త‌గారు. ఆగ‌స్ట్ 31న ఈ చిత్రం విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. అల్ల‌రి అల్లుడు త‌ర‌హాలో పూర్తిగా ఫ‌న్ రైడ్ గా ఈ చిత్రం రూపొందుతుంది. అప్ప‌ట్లో నాగార్జున ఆ సినిమా ఎంత పేరు తీసుకొచ్చిందో.. ఇప్పుడు శైల‌జారెడ్డి అల్లుడు కూడా చైతూకు అంతే పేరు తీసుకొస్తుంద‌ని న‌మ్ముతున్నాడు మారుతి. త‌న స్టైల్ లోనే కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం రూపొందుతుంది. 

More Related Stories