English   

ఎన్టీఆర్ కొర‌టాల సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్

 Ramya Krishna
2021-06-18 15:04:45

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కాకపోతే కరోనా ఫ‌స్ట్ వేవ్ మరియు సెకండ్ వేవ్ ల వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు.  ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమాను ప్రారంభించడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. 

ఇదిలా ఉండ‌గా గ‌త కొద్ది రోజులుగా ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తున్న‌ట్టు వార్తలు వస్తున్నాయి, కానీ అధికారికంగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలుబ‌డ‌లేదు. అయితే తాజా టాక్ ప్ర‌కారం ఈ సినిమాలో మరొక ముఖ్య పాత్రలో సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ను తీసుకోవాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణ పాన్ ఇండియా న‌టిగా ఎదిగారు. రమ్యకృష్ణ పాపులారిటీ తమ సినిమాకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని దర్శకనిర్మాతలు నమ్ముతున్నట్లు తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ మరియు  రమ్యకృష్ణ ఇంతకు ముందే 'నా అల్లుడు' మరియు 'సింహాద్రి' సినిమాలో కలిసి నటించారు. ఇక ఈ సినిమాలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ ఎలా ఉండ‌బోతుందో చూడాలి.
 

More Related Stories