English   

బి గ్రేడ్ బ్యూటీ పాలిటిక్స్ లోకి వస్తానంటోంది..

ramya krishnan

ఒకప్పుడు బి గ్రేడ్ సినిమాలతో ఆకట్టుకున్న బ్యూటీ రమ్యశ్రీ. తర్వాత ఎన్నో సినిమాల్లో వ్యాంప్ తరహా పాత్రలతో ఫేమస్ అయింది. అఫ్ కోర్స్ తను కొన్ని మంచి పాత్రల్లో కూడా కనిపించింది. కాలేజ్ లెక్చరర్ గా మగ లెక్చరర్స్ ను కవ్వించే పాత్రలూ చేసింది. కానీ ఫైనల్ గా రమ్యశ్రీ అంటే చాలామంది బి గ్రేడ్ సినిమాల నటిగానే తెలుసు. ఆ మధ్య తను నిర్మాతగా మారి ఓ మల్లి అనే సినిమా తీసింది. కానీ ఆ సినిమా విడుదల చేయడానికి నానా తంటాలు పడింది. ఫైనల్ గా రిలీజ్ చేయలేక యూ ట్యూబ్ లో పెట్టేసింది. యూట్యూబ్ లో బానే ఆడిందీ మల్లి సినిమా. అయితే లేటెస్ట్ గా రమ్యశ్రీకి పొలిటికల్ మస్కూటో కుట్టిందట. తను కూడా పాలిటిక్స్ లోకి రావాలని ఉవ్విళ్లూరుతుంది. అయితే తనకు ఈ ఆలోచన వచ్చింది ఇప్పుడు కాదట. ఎప్పటి నుంచో ఆమెను తమ పార్టీలోకి రావాలని తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది పార్టీ నేతలు కోరారట. అప్పుడే రావాలని అనుకున్నా.. కానీ కుదర్లేదు. ఇప్పుడు నేను కూడా యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలనుకుంటున్నాని రీసెంట్ గా ఆంధ్రలోని సబ్బవరం అనే ఊళ్లో మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఆవిడే ఇలా చెప్పుకొచ్చింది. మరి రమ్యశ్రీ కోసం పార్టీ కండువా పట్టుకుని సిద్ధంగా ఉన్న నేతలెవరో.. 
 

More Related Stories