English   

రానా దగ్గుబాటి.. నువ్వు సూపర్ సామీ.. పంచెకట్టుతో కొట్టేసావ్..

Rana Daggubati
2020-05-22 11:29:32

రానా దగ్గుబాటి, మిహీక బజాజ్ ప్రీ వెడ్డింగ్ వేడుక రెండు కుటుంబాల కలయికతో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలు కూర్చుని నిశ్చితార్థం, పెళ్లితో పాటు రిసెప్షన్ గురించి కూడా మాట్లాడుకున్నారు. దీన్నే రోకా ఫంక్షన్ అని కూడా అంటారు. మన దగ్గర కాదు కానీ నార్త్ లో ఈ ఆచారం ఉంది. ఇదిలా ఉంటే ఈ రోజుల్లో చాలా మంది ఫంక్షన్ అంటే చాలు ఆ వేర్, ఈ వేర్ అంటూ డబ్బులు తగలేస్తుంటారు. కానీ రానా మాత్రం అలా చేయలేదు. సింపుల్ గా లుంగీ కట్టుకుని తెలుగువాడి సంప్రదాయాన్ని కాపాడాడు.. డబ్బులను కూడా ఆదా చేసాడు. రానాను చూసిన వాళ్లంతా వామ్మో మనోడు మామూలోడు కాదంటున్నారు. 

ఎందుకంటే రానా లాంటి హీరోకు సంబంధించిన ఫంక్షన్ అంటే ఎలా ఉండాలి..? కానీ అలాంటివేం అక్కడ కనిపించ లేదు. సింపుల్ గా రెండు కుటుంబాలు వచ్చాయి.. మాట్లాడుకున్నాయి.. రెండు ఫోటోలు దిగాయి అంతే. అంతకంటే సందడి కూడా కనిపించలేదు. ఖర్చు కూడా అంతగా ఏం లేదు. పంచెకట్టుతో అందర్నీ పడేసాడు రానా.. చేతికి ఉంగరాలు కానీ.. బంగారం కానీ.. మెల్లో గొలుసు కానీ ఏం కనిపించలేదు. ఏదో నార్మల్ గా అలా అయిపోయిందంతే. ఇదంతా చూసిన తర్వాత రానా దగ్గుబాటిని చూసి నువ్వు సూపర్ రాజా.. సంప్రదాయంతో పాటు ఖర్చును కూడా బతికించావంటూ పొగిడేస్తున్నారు.

More Related Stories