English   

రానా.. నీ యుద్ధాలకు అంతే లేదా.. ?

rana-daggubati
2018-05-07 15:50:14

రానా.. హీరోగా ప్రయత్నింనన్నాళ్లూ క్లిక్ కాలేదు. అదే టైమ్ లో బాలీవుడ్ లోనూ కొంత వరకూ మెరిశాడు. కానీ సరైన బ్రేక్ రాలేదు. ఎప్పుడైతే బాహుబలి చేశాడో అతని దశతిరిగిపోయింది. నేషనల్ వైడ్ గా హాట్ ఫేవరెట్ అయిపోయాడు. దానికి తోడు అతని బీస్ట్ బాడీ కూడా చాలా పాత్రలకు కారణమౌతోంది. అయితే ఈ మధ్య రానాకు వస్తోన్న కథలన్నీ యుద్ధాల నేపథ్యంలోనే ఉంటుండటం విశేషం. ఇప్పటికే అతను 1945లో సాగే ఓ కథలో నటిస్తున్నాడు. ఇది ఆజార్ హింద్ ఫౌజ్ నేపథ్యంల సాగే కథ. ఈ మూవీలో రానా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే సైనికుడుగా కనిపిస్తాడు. దీంతో పాటు పీరియడ్ డ్రామాగానే వస్తోన్న మరో బాలీవుడ్ మూవీ హథీ మేరీ సాథీలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇది కూడా యుద్ధాల సినిమానే. ఇక ట్రావన్ కోర్ రాజు మార్తాండ వర్మ బయోపిక్ లోనూ రానానే హీరో. మార్తాండ వర్మ పేరుతోనే ఈ సినిమా తెరకెక్కబోతోంది. అంటే అతను చేస్తోన్న మూడు సినిమాలూ యుద్ధల నేపథ్యంలో సాగే కథలే. ఆల్రెడీ గతంలో చేసిన బాహుబలి అలాంటి ఫిక్షన్ సినిమానే. తర్వాత చేసిన ఘాజీ కూడా వార్ బ్యాక్ డ్రాప్ లో సాగిన కథే. అయితే ఇప్పుడు మరో సినిమా ఒప్పుకున్నాడు రానా. ఇది కూడా యుద్ధ నేపథ్యంలో సాగే కథేనట. మరి ఈ కథ ఎవరిదో తెలుసా.

నేనేరాజు నేనేమంత్రితో రానాకు మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు తేజ మళ్లీ రానాను ఒప్పించినట్టు టాక్. లేటెస్ట్ గా బాలయ్య, వెంకటేష్ సినిమాల నుంచి బయటకు వచ్చిన తేజ మళ్లీ ఏ స్టార్ హీరోనూ కలవలేవు. మధ్యలో నాగార్జునతో సినిమా అంటూ వార్తలు వచ్చాయి. కానీ అవేవీ నిజం అని ఎవరూ చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ రానాతోనే సినిమాకు సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. ఈ కథ ఇండో- పాక్ వార్ నేపథ్యంలో నడుస్తుందట. కాకపోతే ఇది కూడా రూమరే. ఈ విషయాన్ని అటు దర్శకుడు కానీ, రానా కానీ ఇంకా కన్ఫార్మ్ చేయలేదు. అయితేనేం ఇప్పుడు రానా చేస్తున్నవన్నీ  వెండితెర యుద్ధాలే కదా.. మరి ఇలా ఎన్ని యుద్ధాలు చేస్తావు రానా.. ఈ యుద్ధాలకు అంతే లేదా..? బట్ ఎనీ హౌ.. రానా చేస్తోన్న చేయబోతోన్న ప్రతి వార్ లోనూ గెలవాలని కోరుకుందాం.. 

More Related Stories