English   

సాడ్ న్యూస్ చెప్పిన రానా..70 శాతం స్ట్రోక్ రావచ్చు..30 శాతం మరణించవచ్చు

Rana
2020-11-23 13:21:41

గత కొంతకాలంగా నటుడు రానా దగ్గుబాటి అనారోగ్యంతో బాధపడుతున్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలపై రానా ఎప్పుడూ స్పందించలేదు. ఇక ఆ తరవాత రానా హీరోగా వస్తున్న "అరణ్య" సినిమా పోస్టర్ విడుదల కావడంతో సినిమా కోసం రానా బరువు తగ్గాడని అంతా అనుకున్నారు. కాగా తాజాగా సమంత హోస్ట్ గా వ్యవహరిస్తున్న  సామ్ జామ్ కార్యక్రమంలో రానా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రానా ఎమోషనల్ అయ్యారు. జీవితం వేగంగా ముందుకు వెళుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక చిన్న పాజ్ బటన్ వచ్చిందని రానా అన్నారు. పుట్టినప్పటి నుండి తనకు బీపీ ఉందని రానా చెప్పారు.

నీ కిడ్నీలు పాడవుతాయి..స్ట్రోక్ హేమరేజ్ కి  (తలలో నారాలు చిట్లిపోవడం)70 శాతం, మరణానికి 30 శాతం అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారని రానా వెల్లడించాడు. ఈ విషయాన్ని చెబుతూ రానా ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్నారు. వెంటనే సమంత స్పందిస్తూ "ఆ సమయంలో నేను మిమ్మల్ని గమనించా మీ చుట్టూ జనాలు ఎన్నో మాట్లాడుకున్నా...మీరు మాత్రం ఎంతో ధైర్యంగా ఉన్నారు..నిజంగా మీరు సూపర్ హీరో" అంటూ చెప్పుకొచింది. కార్యక్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా రానాతో పాల్గొన్నారు.

More Related Stories