English   

నారా రోహిత్ దారిలో రానా ద‌గ్గుపాటి

Rana-Daggubati
2018-08-04 10:20:15

నారా.. రానా.. ఇంటిపేర్లు తిర‌గేస్తే ఒక్క‌టే అవుతాయి. అందుకే ఇప్పుడు ఇద్ద‌రి ఆలోచ‌న‌లు కూడా ఒకేలా ఉన్నాయేమో మ‌రి..? ఈ ఇద్ద‌రూ స్టార్ డ‌మ్ కోసం ఆలోచించ‌రు. క‌థ‌లు బాగుంటే సినిమాలు చేస్తుంటారు. అవి ఎప్పుడు విడుద‌ల‌వుతాయో కూడా ప‌ట్టించుకోరు. ఇన్నాళ్లూ టాలీవుడ్ లో ఇలా నారా రోహిత్ ఒక్క‌డే అనుకుంటే ఇప్పుడు రానా కూడా త‌యారైపోయాడు. ద‌గ్గుపాటి వార‌సుడు ప్ర‌స్తుతం వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. హీరోగా.. విల‌న్ గా.. కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా.. క‌థ న‌చ్చితే ఎలాంటి పాత్ర‌లో అయినా న‌టించ‌డానికి ఈయ‌న ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు రానా.

ఎన్టీఆర్ బ‌యోపిక్ లో నారా చంద్ర‌బాబునాయుడు పాత్ర‌లో న‌టించ‌డానికి ఓకే చెప్పాడు రానా. ముందు ఈ చిత్రంలో న‌టించ‌డానికి కాస్త టైమ్ తీసుకున్నా కూడా ఇప్పుడు క్రిష్ చెప్పిన తీరు న‌చ్చి ఓకే అనేసాడు. ప్ర‌త్యేకంగా అమ‌రావ‌తి వెళ్లి అక్క‌డ చంద్ర బాబును కూడా క‌లిసారు బాల‌య్య‌.. రానా.. క్రిష్. అన్న‌ట్లు ఈ సినిమాతో పాటు రానా మ‌రో అర‌డ‌జ‌న్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఇవ‌న్నీ ఎప్పుడు పూర్తి చేస్తాడో చూడాలిక‌..! ఎన్టీఆర్ బ‌యోపిక్ లో త‌న పాత్ర వారం రోజులే ఉంటుంది కాబ‌ట్టి ముందు ఇదే పూర్తిచేసేలా క‌నిపిస్తున్నాడు ఈ ద‌గ్గుపాటి హీరో. మ‌రి చంద్ర‌బాబు పాత్ర‌లో రానా ఎలా ఉండ‌బోతున్నాడో..?

More Related Stories