English   

బక్కచిక్కిన రానా....ఎందుకో ?

 Rana
2019-04-26 11:21:06

బాహుబలి సినిమా అందులో నటించిన వారికి ఆ సినిమా కోసం పని చేసిన వారికి ఎంత క్రేజ్ తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక అందులో లీడ్స్ కి అయితే స్టార్ హోదాని మించిన హోదాని కట్టబెట్టింది. తాజాగా బాహుబలి స్టార్ రానా హైద‌రాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కెమెరా కంట ప‌డ్డాడు. అందులో స‌న్న‌గా, భారీ గ‌డ్డంతో క‌నిపించాడు. రానా లుక్‌కి సంబంధించిన ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. రానా ఎందుకు సన్నబడ్డాడు అనే చర్చ మొదలయింది ఇప్పుడు. ఆయన ఏదైనా ఆరోగ్య స‌మ‌స్య‌ల వ‌ల‌న బాధపడుతూ సన్న బడ్డాడా లేక ఆయన నటిస్తున్న  హాథీ మేరే సాథీ అనే బై లింగ్యుయల్ సినిమా కోసం లేదా వేణు దర్శకత్వంలో వస్తున్న విరాటపర్వం సినిమా కోసం అలా మారాడా అన్న‌ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందేహాలకి కారణం ఏంటంటే కొద్ది రోజుల క్రితం ఆయన కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధ‌ప‌డుతున్నారని అమెరికా తీసుకువెళ్ళి అక్కడ వైద్యం చేయించనున్నారు అంటూ పుకార్లు వచ్చాయి. దీని మీద రానా క్లారిటీ ఇచ్చినా ఇప్పుడు ఈ లుక్ చూసి మళ్ళీ ఈ పుకార్లు ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

More Related Stories