English   

180 కోట్లతో రానా చిత్రం.. 

Rana-Hiranyakashipu
2018-07-03 16:08:58

రానా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 9 ఏళ్లైపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న‌కు సోలో మార్కెట్ పెద్ద‌గా రాలేదు. నేనేరాజు నేనేమంత్రి.. ఘాజీ లాంటి సినిమాలు విజ‌యం సాధించినా కూడా అవి మ‌రీ 40-50 కోట్లైతే తీసుకురాలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు 20 కోట్ల మార్కెట్ కూడా లేని హీరో రానా. అలాంటి హీరోపై ఇప్పుడు ఏకంగా 180 కోట్ల బ‌డ్జెట్ పెట్ట‌డం అనేది నిజంగా ఆశ్చ‌ర్య‌మే. అయితే అన్ని డ‌బ్బులు ఎవ‌రో బ‌య‌టి నిర్మాత రానాపై ఎందుకు పెడ‌తాడు.. ఏ ధైర్యంతో పెడ‌తాడు.. అందుకే తండ్రే ఈ సాహ‌సం చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇప్పుడు నిజంగానే రానాపై 180 కోట్లు పెట్ట‌డానికి రెడీ అవుతున్నాడు సురేష్ బాబు. ఈయ‌న హీరోగా హిర‌ణ్య క‌శ్య‌ప సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలిస్తే మ‌రో షాక్ త‌గులుతుంది. రుద్ర‌మ‌దేవి సినిమాతో ప‌ర్లేద‌నిపించిన గుణ‌శేఖ‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. ఇప్ప‌టికే క‌థ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. రానా ప్ర‌స్తుతం న‌టిస్తున్న సినిమాలు పూర్తికాగానే హిర‌ణ్య క‌శ్య‌ప మొదల‌వుతుందని చెప్పాడు సురేష్ బాబు. మ‌రి ఈ చిత్రంతో రానా ఎంత‌వ‌ర‌కు మెప్పిస్తాడో..? ఇంత బ‌డ్జెట్ రానాపై వ‌ర్క‌వుట్ అవుతుందో లేదో చూడాలిక‌..!

More Related Stories