English   

ఆ సినిమా కోసం 30 కిలోలు తగ్గిన రానా

Rana Daggubati.jpg
2020-02-26 14:18:07

సినిమా ఫ్యామిలీ నుండి వచ్చినా రానా తనదైన మార్క్ వేసుకున్నాడు. చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకులను పలకరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన ప్రభు సోలమన్ దర్శకత్వంలో “హాథీ మేరే సాథీ ” అనే సినిమా చేస్తున్నాడు. తెలుగులో ‘అరణ్య’, తమిళ్‌లో కదన్ పేరుతో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేసింది. ఈ సినిమా మూడు భాషల్లో విడుదలవుతుండగా సినిమాలోని రెండు ఆసక్తికర పాత్రల్ని శ్రియా పిల్గా వోంకర్, జోయా హుస్సేన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి రానా ఫస్ట్ లుక్ బయటకు వచ్చిన నాటి నుండి రానా గురించి చర్చ మొదలయింది.

ఎందుకంటే ఈ సినిమాలో రానా అడవి మనిషి పాత్రలో కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ఆయన చాలా కఠినమైన ఆహార నియమాల్ని పాటించడమే కాకుండా, కఠోర శ్రమతో 30 కిలోల బరువు తగ్గారని అంటున్నారు. ఈ సినిమా 2020 ఏప్రిల్ 2 విడుదలకు సిద్ధమవుతోంది. అస్సాంలోని కజిరంగా ప్రాంతంలో ఉన్న ఏనుగుల ఆవాసాన్ని మనుషులు అక్రమంగా కబ్జా చేసిన ఘటనను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రభు సాల్మన్ రూపొందించారు. నిజానికి ఈ సినిమా కోసం బరువు తగ్గితే రానా మీద రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. ఆయనకి ఆరోగ్యం బాలేదని రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు రకరకాల ప్రచారాలకి రానా బ్రేక్ వేసినట్టయ్యింది.

More Related Stories