English   

ఒక్క‌రోజుకు 6 కోట్లా.. ఏంటిది సంజూ..? 

sanju
2018-07-26 08:34:26

ఒక్క‌రోజుకు 6 కోట్ల పారితోషికం.. ఇక్క‌డ ఒక్క సినిమా చేస్తే కూడా కొంద‌రు క్రేజీ హీరోల‌కు అంతివ్వ‌డం లేదు. అలాంటిది ఒక్క‌రోజులోనే అంత ఎవ‌రు ఇస్తున్నారు అనుకుంటున్నారా..? ఉన్నారు.. అంత డిమాండ్ ఉన్న స్టార్ హీరోలు కూడా ఇండియాలో ఉన్నారు. ర‌ణ్ బీర్ క‌పూర్ నే తీసుకోండి.. సంజూ సినిమా ఈయ‌న కెరీర్ ను మార్చేసింది. దీనికి ముందు వ‌ర‌కు అలా ఉన్నాడంటే ఉన్నాడంతే. కానీ యాడ్స్ లో మాత్రం ర‌ణ్ బీర్ క‌పూర్ ఎప్పుడూ తోపే. ఈయ‌న సినిమాలు ఫ్లాపైనా కూడా ఎండోర్స్ మెంట్స్ విష‌యంలో దుమ్ము దులిపేస్తూనే ఉన్నాడు ర‌ణ్ బీర్. అయితే పారితోషికం దగ్గ‌రికి వ‌చ్చేస‌రికి మాత్రం రోజుకు 3 కోట్లు తీసుకునేవాడు. 

ఇప్పుడు సంజూ విడుద‌లై 550 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. దాంతో మ‌నోడి రేంజ్ పెరిగిపోయింది. సంజూ ఎఫెక్ట్ తో ఇప్పుడు రోజుకు 6 కోట్లు తీసుకుంటున్నాడు ర‌ణ్ బీర్ క‌పూర్. యాడ్స్ లో అమీర్ ఖాన్ త‌ర్వాత అంత పారితోషికం తీసుకునేది ఈయ‌నే. అక్క‌డ రోజుకు కాదు.. గంట‌కు కోటి రూపాయ‌లు తీసుకుంటాడు అమీర్ ఖాన్. ఇక్క‌డ క‌నీసం రోజుకు 6 కోట్లు తీసుకుంటున్నాడు ర‌ణ్ బీర్. కోటి కోసం నానా తిప్ప‌లు ప‌డుతున్న హీరోలున్న ఇదే ఇండ‌స్ట్రీలోనే.. రోజుకు కోట్ల‌కు కోట్లు సంపాదిస్తున్న వాళ్లు కూడా ఉండ‌టం నిజంగా విచిత్ర‌మే క‌దా..? ఇలాంటి టైమ్ లో ర‌ణ్ బీర్ కు మ‌రో హిట్ గానీ ప‌డితే రోజుకు 10 కోట్లు అడిగేస్తాడేమో..?

More Related Stories