English   

ర‌ణ్ బీర్ ఈజ్ బ్యాక్.. రాస్కోరా సాంబ‌..!

Ranbir-Kapoor
2018-06-30 16:22:38

ఫ్యూచ‌ర్ సూప‌ర్ స్టార్.. బాలీవుడ్ ను మ‌రో ప‌దేళ్ల పాటు దున్నేస్తాడు.. బాక్సాఫీస్ కింగ్.. ఇవ‌న్నీ ఐదేళ్ల‌ కింద ర‌ణ్ బీర్ దూకుడు చూసి వ‌చ్చిన వార్త‌లు.. ఇచ్చిన బిరుదులు.. కానీ ఐదేళ్లు గ‌డిచే స‌రికి సీన్ అంతా మారిపోయింది. కొంత‌కాలంగా ఈ హీరో సినిమాల‌కు క‌నీసం ఓపెనింగ్స్ కూడా రావ‌డం లేదు. ఇది క‌దా ద‌రిద్రం అంటే. బేష‌ర‌మ్.. రాయ్.. బాంబే వెల్‌వెట్.. తమాషా.. ఇలా అన్ని సినిమాలు డిజాస్ట‌ర్లే.  లక్కీలేడీ దీపికాకు కూడా త‌న దుర‌దృష్టాన్ని అంటించాడు ర‌ణ్ బీర్. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న జగ్గాజాసూస్ కూడా డిజాస్ట‌ర్ గా నిలిచింది. మాజీ గాళ్‌ఫ్రెండ్ కత్రినాతో న‌టించిన సినిమా కూడా డిజాస్ట‌రే. మ‌ధ్య‌లో క‌ర‌ణ్ జోహార్ తో చేసిన ఏ దిల్ హై ముష్కిల్ ప‌ర్లేద‌నిపించింది కానీ హిట్ కాదు. ఇలాంటి టైమ్ లో సంజూతో త‌ను ఏంటో నిరూపించుకున్నాడు ఈ హీరో. 

ఇప్పుడు ఈ సినిమాలో ర‌ణ్ బీర్ యాక్టింగ్ చూసి ఫిదా కానీ ప్రేక్ష‌కుడు ఉండ‌డేమో. అస‌లు తెర‌పై నిజంగానే మ‌నం చూస్తున్న‌ది సంజ‌య్ ద‌త్ నా.. లేదంటే ర‌ణ్ బీర్ క‌పూర్ నా అనే అనుమానం వ‌స్తుంది. సినిమా మొద‌లైన ప‌ది నిమిషాల‌కే పూర్తిగా సంజూ బాడీలోకి వెళ్లిపోయాడు ర‌ణ్ బీర్. ఈయ‌న ఎంత గొప్ప న‌టుడో ఈ ఒక్క సినిమా చూస్తే అర్థ‌మైపోతుంది. హిరాణీ ఎంత చెప్పినా కూడా ర‌ణ్ బీర్ క‌పూర్ కూడా ఈ పాత్ర‌లోకి ఒదిగిపోవాలి క‌దా.. అలా ఒదిగిన తీరు చూసి అంతా అద్భుతం అంటున్నారిప్పుడు. సంజూతో సంజ‌య్ ద‌త్ ఈజ్ బ్యాక్ మాత్ర‌మే కాదు.. ర‌ణ్ బీర్ క‌పూర్ ఈజ్ ఆల్సో బ్యాక్. ఇప్ప‌ట్నుంచీ మ‌ళ్లీ ఈయ‌న టైమ్ మొద‌లైంది. పైగా అదృష్టం కొద్దీ ముగ్గురు ఖాన్స్ లో షారుక్ ఇప్పుడు బాగా వెన‌క‌బ‌డిపోయాడు. ఇలాంటి టైమ్ లో ర‌ణ్ బీర్ రేస్ మొద‌లుపెడితే కింగ్ ఖాన్ కు తిప్ప‌లు త‌ప్ప‌వు. 

More Related Stories