English   

ఖాన్స్ కు ఎర్త్ పెట్టిన క‌పూర్.. 

Ranbir-Kapoor

ఎప్ప‌ట్నుంచో వినిపిస్తున్న వార్తే ఇది. బాలీవుడ్ లో ప్ర‌తీ రికార్డుకు కేరాఫ్ అడ్ర‌స్ ఖాన్సే. ఇప్పుడు షారుక్ సీన్ లో లేక‌పోయినా.. అమీర్, స‌ల్మాన్ అంతా చూసుకుంటున్నారు. వీరి ఆధిపత్యానికి బ్రేకులు వేసే మొన‌గాడు ర‌ణ్ బీర్ క‌పూర్ అంటూ చాలా ఏళ్లుగా వినిపిస్తున్న వార్తే. ఇప్పుడు ఇదే జ‌రిగింది. ఈయ‌న న‌టించిన సంజూ ఆల్ టైమ్ రికార్డుల దిశ‌గా అడుగేస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఖాన్స్ కు త‌ప్ప మిగిలిన హీరోల‌కు అంద‌ని రికార్డుల‌తో ఆడుకుంటున్నాడు ర‌ణ్ బీర్. ఖాన్స్ కాకుండా ఇండియాలో 250 కోట్లు అందుకుంది ఒక్క ప‌ద్మావ‌తి మాత్ర‌మే. ఇప్పుడు ర‌ణ్ బీర్ క‌పూర్ ఏకంగా 300 కోట్లు కొడుతున్నాడు. సంజూ ఇంత‌టి రికార్డులు సృష్టిస్తుందంటే దాని వెన‌క ఉన్న మాస్ట‌ర్ బ్రెయిన్ రాజ్ కుమార్ హిరాణీ. ఆయ‌న చేసాడు కాబ‌ట్టే ఈ చిత్రం ఇంత‌గా సంచ‌ల‌నాలు చేస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో 290 కోట్లు.. ఓవ‌ర్సీస్ తో క‌లిపి 100 కోట్లు వ‌సూలు చేసింది. చూస్తుంటే ఫుల్ ర‌న్ లో 400 కోట్లు కూడా దాటేసి 450 కోట్ల వైపు ప‌రుగులు తీసేలా ఉన్నాడు సంజూ. ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే 230 కోట్ల‌కు పైగా వ‌సూలు చేయాలి. కానీ ఇప్పుడు ఆ మార్క్ దాటి రెండింత‌లు తీసుకొచ్చేందుకి రెడీ అయ్యాడు సంజూ. అన్న‌ట్లు ర‌ణ్ బీర్ క‌పూర్ కు కూడా ఐదేళ్ల త‌ర్వాత అస‌లైన విజ‌యం వ‌చ్చింది. ఈయ‌న కెరీర్ చాలా ఏళ్లుగా డ‌ల్ పీరియ‌డ్ లో ఉంది. అనుకున్న‌ట్లుగానే సంజూ వ‌చ్చి ర‌ణ్ బీర్ ను బ‌తికించాడు. మొత్తానికి వ‌ర‌స‌గా ఐదో విజ‌యాన్ని అందుకుని ఔరా అనిపించాడు రాజ్ కుమార్ హిరాణి. 

More Related Stories