English   

ప్రివ్యూ: స‌ంజూ

Sanju-preview
2018-06-29 10:52:57

2018 మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒక‌టైనా సంజూ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ చిత్రం మ‌రికొద్ది గంట‌ల్లో విడుద‌ల కానుంది. జూన్ 29న ప్ర‌పంచవ్యాప్తంగా 3000 స్క్రీన్స్ లో విడుద‌ల కానుంది సంజూ. రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌కుడు కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు ఆకాశంలో ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్లాప్ లేని ద‌ర్శ‌కుడు ఈయ‌న‌. పైగా అన్ని సినిమాలతో కొత్త రికార్డులు తిర‌గ‌రాసిన చ‌రిత్ర ఈయ‌న సొంతం. ఇప్పుడు సంజ‌య్ ద‌త్ జీవితాన్ని తెర‌పైకి ఆవిష్క‌రించాడు ఈ ద‌ర్శ‌కుడు. అస‌లు సంజ‌య్ ద‌త్ జీవితం అంటేనే వివాదాల మ‌యం. స్టార్ ఇమేజ్ ఉన్నా.. తండ్రి అండ ఉన్నా.. చిన్న ఏజ్ లోనే పెడ‌దోవ ప‌ట్టి బ్యాడ్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు సంజ‌య్ ద‌త్. 35 ఏళ్ల‌కే దేశ‌ద్రోహం కేస్ నెత్తిన వేసుకున్నాడు. అక్ర‌మాయుధాల కేస్ లో ఏళ్ల‌కేళ్లు జైల్లో ఉన్నాడు. ఇక ఇండ‌స్ట్రీ ప‌రంగా కూడా సంజ‌య్ ద‌త్ పై చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అమ్మాయిల‌తో సంబంధాలు.. హీరోయిన్ల‌తో ఎఫైర్లు.. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను టైమ్ కు రాకుండా ఇబ్బంది పెట్ట‌డాలు.. ఇలా ఎన్నో సంజూ బాబా జీవితంలో జ‌రిగాయి. వీట‌న్నింటినీ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా సినిమాలో చూపిస్తున్నాడు రాజ్ కుమార్ హిరాణీ.
 
సంజూ ట్రైల‌ర్ లోనే సినిమా ఎలా ఉంటుందో చూపించాడు ద‌ర్శ‌కుడు. అదేదో యాడ్ లో చెప్పిన‌ట్లు దాచుకోడానికి ఏమీ లేద‌న్న‌ట్లు అన్నీ చూపించాడు హిరాణి. ఇదే సినిమాపై అంచ‌నాలు వంద రెట్లు పెంచేసింది. అస‌లు జైల్లో ఈయ‌న జీవితం ఎలా గ‌డిచిందో అనే విష‌యంపై ఇన్నాళ్లూ చిన్న అనుమానాలు ఆస‌క్తి ఉండేవి. ట్రైల‌ర్ లో క్లారిటీ ఇచ్చాడు రాజ్ కుమార్. జైల్లో సంజ‌య్ ద‌త్ కు న‌ర‌కం చూపించారు పోలీసులు. ఇవ‌న్నీ ట్రైల‌ర్ లోనే చూపించేసాడు ద‌ర్శ‌కుడు. ఇక ర‌ణ్ బీర్ క‌పూర్ అయితే సంజ‌య్ దత్ పాత్ర‌లోకి దూరిపోయి న‌టించాడు. అస‌లు ఈయ‌న న‌టించాడు అన‌డం అవ‌మాన‌మే.. జీవించాడంతే. ద‌ర్శ‌కున్ని పూర్తిగా న‌మ్మేసి సంజూ పాత్ర‌లో ఒదిగిపోయాడు. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే అక్ష‌రాలా 240 కోట్లు వ‌సూలు చేయాలి. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రం ఏం మాయ చేస్తుందో..?

More Related Stories