English   

రంగస్థలంపై రచ్చ.. టూమచ్ గురూ.. 

Rangamma-Mangamma
2018-03-16 08:03:55

మనోభావాలు.. అసలు ఉంటాయో లేదోతెలియదు కానీ.. సినిమా వారితో ఓ రేంజ్ లో గేమ్ ఆడేస్తుంటాయీ భావాలు. చిన్న విషయాలను కూడా పెద్దది చేస్తూ.. ఒక్కోసారి నిజంగానే మంచి విషయాలు పట్టేస్తూ ఉంటాయి. కానీ చాలాసార్లు మనోభావాల పేరుతో వ్యక్తులు చేసే అతే అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు రంగస్థలంపై  చేస్తోన్న రచ్చ కూడా ఇలాగే ఉంది. రంగస్థలంలో రంగమ్మా మంగమ్మా అనే పాట ఉంది. తన  గురించి ప్రియుడు పట్టించుకోవడం లేదని గోముగా తన ఫ్రెండ్స్ తో చెప్పుకుంటోన్న ఓ యువతి బాధ ఈ పాటలో కనిపిస్తుంది. ఆ కోణంలోనే సాగే ఈ పాటలో వచ్చే ఒక లైన్ పై ఇప్పుడు యాదవుల సంఘం మండిపడుతోంది. ‘గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే’అనే ఈ లైన్ లో గొల్లభామ పేరుతో యాదవ మహిళలను కించపరిచారంటూ వారు రచ్చ మొదలుపెట్టారు. కానీ కనీస జ్ఞానం లేకపోతేనే ఇలాంటి రచ్చలు మొదలవుతాయనేది ఈ గొడవ చూస్తేనే తెలుస్తుంది.  నిజానికి గొల్లభామ అనేది ఓ కీటకం. ఆకుపచ్చ రంగులో ఉంటుంది. చెట్లల్లో కలిసిపోయి ఉంటుంది. అది కుడితే పెద్దగా హాని కలగదు కానీ.. కాస్త నొప్పి అనిపిస్తుందంతే. ఆ విషయం పాటలో కూడా క్లియర్ గా చెప్పాడు. గొల్లభామ వచ్చి గోరుగిల్లుతుంటే అని. ఈ చిన్న విషయంతో వారు పెద్ద రచ్చ చేయాలని చూస్తుంటే అసలు మనోభావాల పేరుతో గొడవ చేసే వారందరికీ పెద్ద పెద్ద క్లాసులు పెట్టి తెలుగు భాషను మళ్లీ బోధించాలనిపిస్తుది. మరి ఈ గొడవ ఎటు తేలుతుందో కానీ.. మరీ ఇది టూమ్ అయిపోతోందీ మధ్య.  

More Related Stories