English   

 రంగ‌స్థ‌లం ఇక్క‌డ 75.. అక్క‌డ 3.5..

Rangasthalam-charan
2018-04-15 17:09:33

50 కోట్ల మార్కెట్ ఉన్న హీరో 100 కోట్ల కంటే ఎక్కువ వ‌సూలు చేయ‌డ‌మే కాకుండా రెండు వారాల త‌ర్వాత కూడా బాక్సాఫీస్ ను రూల్ చేస్తుంటే ఏం అనాలి..? అంత‌కంటే ఆ హీరోకు అదృష్టం మ‌రోటి ఉంటుందా..? ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ ను చూస్తుంటే ఇదే అనాల‌నిపిస్తుంది. రంగ‌స్థ‌లంతో సిట్టి బాబు సెట్ చేస్తోన్న రికార్డులు చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ సినిమా విజ‌యం సాధిస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు కానీ మ‌రీ ఈ రేంజ్లో రికార్డుల‌ను మ‌డ‌త పెడుతుంద‌ని మాత్రం ఎవరూ ఊహించ‌లేదు. తెలుగు రాష్ట్రాల్లో 74 కోట్లు దాటేసింది ఈ చిత్ర వ‌సూళ్లు. బాహుబ‌లి కాకుండా దీని కంటే ముందు ఒక్క ఖైదీ నెం.150 మాత్ర‌మే 70 కోట్ల మార్క్ అందుకుంది. ఇప్పుడు రంగ‌స్థ‌లం ఈ లిస్ట్ లో చేరిపోయింది. ఈ దూకుడు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో మ‌రో 10 కోట్లైనా తీసుకొచ్చేలా క‌నిపిస్తుంది. ఈ వారంలోనే ఖైదీ నెం.150 త‌ర్వాత 78 కోట్ల మార్క్ అందుకోవ‌డం ఖాయం. ఇక వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్ల‌లో కూడా ఇప్ప‌టికే ఖైదీ నెం.150 పేరు మీదున్న 104 కోట్ల రికార్డ్ అందుకున్నాడు చ‌ర‌ణ్. యుఎస్ లో కూడా ఈ చిత్రం అరాచ‌కం చేస్తుంది. ఇప్ప‌టికే అక్క‌డ 3.3 మిలియ‌న్ అందుకుంది. ఈ వీకెండ్ లోనే 3.5 మిలియ‌న్ అందుకోవ‌డం ఖాయం. ఇప్ప‌టికే ఇది సృష్టించిన రికార్డులు భ‌ర‌త్ అనే నేనుకు స‌వాల్ గా మారాయి. మొన్న‌టి వ‌ర‌కు ఓవ‌ర్సీస్ లో పెద్ద‌గా మార్కెట్ లేని చ‌ర‌ణ్.. ఇప్పుడు ఒకే సినిమాతో నాన్ బాహుబ‌లి రికార్డుల‌న్నీ త‌న పేర రాసుకున్నాడు. మ‌రి చూడాలి.. చివ‌రి వ‌ర‌కు సిట్టిబాబు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో..? 

More Related Stories