English   

రంగస్థలం రఫ్ఫాడిస్తోంది...

Rangasthalam-collections

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం బాక్సాఫీస్ ను రఫ్ఫాడిస్తోంది. కలెక్షన్ల సునామీతో అన్ని రికార్డునూ తుడిచివేస్తూ ఇంకా స్టడీగానే దూసుకుపోతోంది. ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టార్ తెచ్చుకున్న రంగస్థలం ను ఆపే సినిమానే రాలేకపోయింది. ఫస్ట్ వీక్ కే లాభాల బాటలోకి వెళ్లిపోయిన ఈ మూవీ ఇప్పుడు వందకోట్ల షేర్ కు అతి దగ్గరగా వచ్చింది. చరణ్, సమంత, ఆది, అనసూయ, జగపతిబాబు , దేవీ శ్రీ ప్రసాద్, రత్నవేలు.. ఇలా ఎవరికి వారే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా చూసుకున్న సుకుమార్ రంగస్థలాన్ని ఓ ఎపిక్ గా మార్చాడు. హిస్టరీ క్రియేట్ చేశాడు. రంగస్థలం పది రోజుల కలెక్షన్లు చూస్తే ఓ మంచి కథ రేంజ్ ఏంటనేది తెలుస్తుంది.. 

రంగస్థలం 10రోజుల కలెక్షన్లు.. ఏరియాల వారిగా..

నైజాం        - 19.91కోట్లు
 
సీడెడ్         - 13.10కోట్లు

నెల్లూర్        - 2.46 కోట్లు

గుంటూర్        - 6.76కోట్లు

కృష్ణా              - 5.40 కోట్లు

వెస్ట్                - 4.60 కోట్లు

ఈస్ట్              - 5.84 కోట్లు

యూఏ        - 9.53 కోట్లు

టోటల్ ఏపి, నైజాం షేర్    - 67.63 కోట్లు

కర్ణాటక        - 7.62 కోట్లు

ఆర్.వో.ఐ.        - 2.50 కోట్లు

ఓవర్శీస్        - 15.60 కోట్లు


టోటల్ వరల్డ్ వైడ్ షేర్    - 93.35 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్    - 150  కోట్లు

దీనికంటే ముందు ఈ ఫిగర్స్ సాధించిన నాన్ బాహుబలి మూవీ కూడా మెగా ఫ్యామిలీదే కావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 మాత్రం 102కోట్ల షేర్ తో నాన్ బాహుబలి రికార్డ్స్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. అయితే చిరు లాంగ్ రన్ లో ఈ ఫిగర్ సాధిస్తే.. ఇప్పుడు చరణ్ కేవలం పది రోజుల్లోనే అతనికి చాలా సమీపంలోకి వచ్చాడు. వీటిలో రంగస్థలం అమ్మిన అన్ని ప్రాంతాలూ లాభాల్లోకి వచ్చాయి. ఒక్క  నెల్లూర్, వెస్ట్ గోదావరి తప్ప ఇతర ప్రాంతాలన్నీ మొదటి వారానికే లాభాల్లోకి వచ్చాయి. ఈ రెండు ప్రాంతాలు కూడా ఈ వారాంతానికి బ్రేక్ ఈవెన్ లోకి వెళ్లడం ఖాయం అనుకోవచ్చు. ఏదేమైనా ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ కు ఓ గాట్టి ఊపు తెచ్చిన సినిమా అంటే రంగస్థలం అనే చెప్పాలి. 
 

More Related Stories