English   

మెగాస్టార్ రంగస్థలం వెళుతున్నాడు

Rangasthalam-pre-release
2018-03-12 17:34:29

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం విడుదలకు రెడీ అవుతోంది. టీజర్లతోనూ, సాంగ్స్ తోనూ ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఈ నెల 30న సినిమా విడుదలవుతోంది. దీనికి రెండు వారాల ముందు చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతుంది. ఈ సమ్మర్లో సందడి చేయబోతున్న క్రేజీ మూవీస్ లో రంగస్థలం గురించి స్పెషల్ గా చెప్పాలి. ఎందుకంటే ఇది సుకుమార్-రామ్ చరణ్-సమంత కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా. వరుసగా భారీ హిట్స్ అందుకుంటున్న మైత్రీ మూవీస్ సంస్థలో ఈ చిత్రం రూపొందుతోంది. అన్నింటికి మించి ఇది పీరియాడిక్ మూవీ. అందుకే రంగస్థలంపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.  1985 కాలం నాటి కథగా సుకుమార్ తెరకెక్కుతున్న రంగస్థలం ఏడాది నుంచి సెట్స్ మీదే ఉంది. పీరియాడిక్ మూవీ కావడంతో 1985 నాటి రోజులను గుర్తు చేస్తూ మేకింగ్ ఉండబోతుంది. గోదావరి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా షూటింగ్ జరుపుకుంది. రామ్ చరణ్ లుక్, సమంత లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక చరణ్ ఇందులో చెవిటివాడుగా నటించడంతో అభిమానులతో పాటు అందరిలోనూ క్యూరియాసిటీ ఏర్పడింది. రంగస్థలం టీజర్లు, సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దేవీశ్రీ ప్రసాద్ ఎక్స్ లెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. 

ఈ నెల 18న ఉగాది పండుగరోజున వైజాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటన్ నిర్వహించబోతున్నారు మేకర్స్. అభిమానుల మధ్యన జరిగే ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి అటెండ్ అవుతున్నాడు. అలాగే టాలీవుడ్లోని ప్రముఖ నిర్మాతలు దర్శకులు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. రెగ్యులర్ ఫార్మాట్ నుంచి బయటకొచ్చి రామ్ చరణ్ ఈ మూవీ చేస్తుండటంతో ఇండస్ట్రీలోనూ ఈ మూవీ హాట్ టాపిక్ గా మారింది. భారీ అంచనాలున్న ఈ సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గా రాబోతుంది. 

More Related Stories