English   

200కోట్ల రంగస్థలం

Rangasthalam-200-Crore

ఏ ముహూర్తంలో సెట్ అయిందో కానీ, సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషణ్.. చరణ్ కెరీర్ నే మార్చివేసింది. ఇన్నాళ్లూ పెద్ద రికార్డ్స్ లేవని బాధపడ్డ చరణ్ కు ఏకంగా నాన్ బాహుబలి రికార్డ్సే ఇచ్చాడు సుకుమార్. యూనానిమస్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతోన్న రంగస్థలం లేటెస్ట్ గా 200కోట్ల క్లబ్ లో చేరింది. అఫ్ కోర్స్ ఇది గ్రాస్ అయినా.. ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ మూవీ (నాన్ బాహుబలి)గా రంగస్థలం కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు.. ఓవర్శీస్ లో కూడా నాన్ బాహుబలి రికార్డ్ రంగస్థలందే. యస్ ఇప్పటి వరకూ ఓవర్శీస్ లో శ్రీమంతుడు నాన్ బాహుబలి రికార్డ్స్ లో ఉన్నాడు. రంగస్థలం శ్రీమంతుడును దాటేసింది. 3.44మిలియన్స్ తో రంగస్థలంలో థర్డ్ ప్లేస్ లోకి వచ్చాడు. ఇక ఆ ఫిగర్ దాటుతుందనుకోలేం. కానీ ఇక్కడ క్రియేట్ చేసిన 200కోట్ల రికార్డ్ చిన్నదైతే కాదు. సుకుమార్, రామ్ చరణ్, సమంతల మ్యాజిక్ కు తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం కూడా తోడై సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. రంగస్థలం రికార్డ్స్ ను వేటాడుతూ ఇప్పుడు భరత్ అనేనేను దూసుకువస్తున్నాడు. మరి అతను ఈ రికార్డ్స్ ను దాటతాడా లేదా అనేది చూడాలి. 

More Related Stories