English   

రంగ‌స్థ‌లం బ్యాటింగ్ @ 70 కోట్లు.. 

Rangasthalam-collections
2018-04-04 10:21:45

వామ్మో ఏంటీ దూకుడు.. బాహుబ‌లి కాకుండా మ‌రో సినిమాకు ఐదు రోజుల్లోనే 70 కోట్ల షేర్ రావ‌డమా..? ఏంటీ మాయ.. ఇప్పుడు రంగ‌స్థ‌లంకు వ‌చ్చిన వ‌సూళ్లు చూసి అంతా ఇదే అనుకుంటున్నారు. సాధార‌ణంగా ఎంత సూప‌ర్ హిట్ సినిమా అయినా కూడా వీకెండ్స్ త‌ర్వాత క‌లెక్ష‌న్లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. కానీ రంగ‌స్థ‌లం మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌నంటుంది. తొలి సోమ‌వారం ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 6.48 కోట్ల షేర్ వ‌చ్చింది. ఓవ‌రాల్ గా 7.50 దాటింది. అప్ప‌ట్లో బాహుబ‌లి 1 కంటే ఎక్కువ ఇది. ఇక ఐదో రోజు కూడా 5 కోట్ల షేర్ తెలుగులోనే వ‌చ్చింది. ఇక ఓవ‌ర్సీస్ తో పాటు అన్ని చోట్లా క‌లుపుకుంటే మ‌రో కోటి అద‌నం. ఇప్ప‌టికే రంగ‌స్థ‌లం ఖాతాలో 69 కోట్ల షేర్ వ‌చ్చేసింది. మ‌గ‌ధీర త‌ర్వాత ఇప్పుడు రంగ‌స్థ‌ల‌మే రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో పెద్ద హిట్. అయితే ఈ మాట కూడా రెండు రోజుల్లో పోనుంది. ఎందుకంటే మ‌గ‌ధీర‌ను ఆడుతూ పాడుతూ క్రాస్ చేసేలా ఉంది ఈ చిత్రం. సిట్టిబాబు దూకుడు చూస్తుంటే 100 కోట్ల షేర్ వైపు అడుగులు ప‌డినా ఆశ్చ‌ర్యం అవ‌స‌రం లేదు. ఎందుకంటే రెండో వారం ఛ‌ల్ మోహ‌న్ రంగా ఒక్క‌టే ఉంది. ఈ చిత్రం ఎంత బాగున్నా.. సెకండ్ వీకెండ్ ఫ్యామిలీస్ చూపులు మాత్రం రంగ‌స్థలం వైపే ఉంటాయి. పైగా అది యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ అయితే ఇది ఎమోష‌న‌ల్ సినిమా. దాంతో రెండో వారం కూడా రంగ‌స్థ‌లం ప్ర‌భంజ‌నం కొన‌సాగ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మొత్తానికి చూడాలి ఈ చిత్రం దూకుడు ఎంత‌వ‌ర‌కు.. ఎన్ని రోజులు కొన‌సాగ‌నుందో..? 

More Related Stories