English   

రంగస్థలం.. వాటే ఫిగర్స్ గురూ.. 

Rangasthalam-collections

ఇది కదా హిట్ అంటే.. ఇవి కదా కలెక్షన్స్ అంటే.. రెండో మాటకు తావు లేకుండా రెండో ఆటకూ హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టేయడమే కదా అసలైన సక్సస్ అంటే. ఈ యేడాది ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా రంగస్థలం డిసైడ్ అయిపోయింది. రామ్ చరణ్ కెరీర్ లోనే హయ్యొస్ట్ రేట్ 80కోట్లకు ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ అమ్మేశారు. ఆ మొత్తం ఫస్ట్ వీక్ కే రాబట్టి లాభాల్లోకి వెళ్లబోతోంది రంగస్థలం. ఇప్పటికే 70కోట్ల షేర్ 111కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందీ మూవీ.. చరణ్ కు ఇది ఇప్పటి వరకూ వచ్చిన ఆల్ టైమ్ హయ్యొస్ట్ గ్రాసర్. అలాగే.. ఆనిర్మాతలు చెప్పినట్టు నాన్ బాహుబలి రికార్డ్ నూ తన పేరిటే వేసుకునేలా ఉంది. ఇది కూడా కేవలం ఐదు రోజుల్లోనే. నిజానికి ఎంత పెద్ద హిట్ టాక్ వచ్చినా సోమవారానికి థియేటర్స్ వద్ద సందడి తగ్గుతుంది. కానీ రంగస్థలంకు రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. 

ఇప్పటి వరకూ రంగస్థలం ఏరియాల వైడ్ గా కలెక్ట్ చేసిన వసూళ్లు చూస్తే.. ఈ ఫిగర్స్ కు కళ్లు తిరగడం ఖాయం. ఈ వారం పెద్దగా పోటీ ఇచ్చే సినిమాలేం కనిపించడం లేదు కాబట్టి.. రెండోవారానికి రంగస్థలం లెక్కలు ఓ రేంజ్ కు వెళ్లిపోతాయనేది నిజం.  


నైజాం                - 14.37 కోట్లు
ఉత్తరాంధ్ర           - 6.79 కోట్లు
తూర్పు గోదావరి         - 4.54 కోట్లు
పశ్చిమ గోదావరి         - 3.45 కోట్లు
కృష్ణా              - 4.02 కోట్లు
గుంటూరు            - 5.50 కోట్లు
నెల్లూరు              - 1.80 కోట్లు
కోస్తా జిల్లాలు       - 26.10 కోట్లు
సీడెడ్                - 9.55 కోట్లు
ఏపీ+తెలంగాణ     - 50.02 కోట్లు
యూఎస్ఏ           - 1026 కోట్లు
కర్నాటక             - 5.90 కోట్లు
రెస్టాఫ్ ఏరియాస్         - 4.35 కోట్లు
మొత్తం                - 70.53 కోట్లు  (షేర్)

More Related Stories