English   

ఉగాది ఊపేయబోతోందంతే.. 

allu-arjun

ఈ ఉగాది టాలీవుడ్ ను ఊపేయబోతోంది. ఆడియన్స్ కు ఆనందాల్ని డబుల్ చేయబోతోంది. వరుసగా రిలీజ్ కాబోతోన్న సినిమాలు ఒకవైపు.. రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు మరోవైపు ఉగాదిన సందడి చేయబోతున్నాయి. స్టార్ హీరోల నుంచి స్మాల్ హీరోల వరకూ ఉగాదిని ప్రమోషనల్ గావాడుకునేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు.  ఉగాది ఉత్సాహాన్ని ముందుగా తీసుకురాబోతోన్న సినిమా రంగస్థలం.

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన ఈ మూవీలో సమంత హీరోయిన్. ఉగాది రోజు రంగస్థలం టీమ్ అంతా వైజాగ్ వెళుతోంది. ఆ రోజు రంగస్థలం ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించబోతోంది. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు కాబట్టి వైజాగ్ మెగా ఫ్యాన్స్ కు ఉగాది జోష్ డబుల్ అవుతుందని వేరే చెప్పక్కర్లేదు. ఇక ఇదే వేదికపై మొత్తం పాటలు విడుదల చేస్తారు. 1980నాటి కథాంశంగా వస్తోన్న రంగస్థలంపై భారీఅంచనాలున్నాయి. విశాఖపట్నంలో రంగస్థలం ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఆటపాటలతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన మరెన్నో సంప్రదాయ, జానపద కళల్నిప్రదర్శించబోతున్నారు. ఈ వేడుకకు చిరంజీవితో పాటు చీఫ్ గెస్ట్స్ రాజమౌళి, బోయపాటి కూడా వస్తారనే ప్రచారం జరుగుతోంది.  

రవితేజ, కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో వస్తోన్న నేలటికెట్ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఉగాది రోజునే విడుదల చేయబోతున్నారు. అయితే టైటిల్ ఇదేనా లేదా అనేది కూడా ఆరోజే తేలిపోతుంది. ఎందుకంటే ఇది ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ మాత్రమే కాబట్టి. రవితేజ సరసన మళవిక శర్మ అనే టీనేజ్ బ్యూటీ రొమాన్స్ చేయబోతోంది. రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా రాబోతోన్న ఈ మూవీపై ఎంటైర్ టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.ఉగాదికి మహేష్ బాబు కూడా ఓ సర్ ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకూ టీజర్ మాత్రమే వచ్చిన భరత్ అనే నేను పాటల విడుదల ఆ రోజు నుంచే మొదలు కాబోతోంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న భరత్ అనేనేను ఫస్ట్ సాంగ్ ను ఉగాది సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. దీనికి కూడా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక ఉగాదితో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి ఆ తర్వాత ఒక్కో పాటను విడుదల చేయబోతున్నారు.
 
ఇలాంటి పండగల్ని బాగా క్యాష్ చేసుకునేవారిలో బన్నీ ముందుంటాడు. అందుకే ఈ ఉగాదికి మరో స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ విషయంలో చిన్న కన్ఫ్యూజన్ లో ఉంది టీమ్. ఇప్పటికే మూడు పాటలు విడుదల చేశారు కాబట్టి.. మళ్లీ సాంగ్ రిలీజ్ చేయడం కంటే ఏదైనా వీడియో విడుదల చేస్తే బెటరేమో అనుకుంటున్నారు. బట్ ఇంకా టైముంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ఏదో ఒకటి బన్నీ ఫ్యాన్స్ ను ఊపేయడం గ్యారెంటీ. 
 
నాగచైతన్య సవ్యసాచి మూవీ ఫస్ట్ లుక్ కూడా ఉగాదినాడే రాబోతోంది. చందు మొండేటి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో తమిళ్ స్టార్ హీరో మాధవన్ విలన్ గా నటిస్తున్నాడు. వీటితో పాటు నాని కృష్ణార్జున యుద్ధం నుంచి మరో పాటవచ్చే అవకాశం ఉంది. అలాగే విజయ్ దేవరకొండ టాక్సీవాలా టీజర్ వస్తుందని చెబుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం టీజరూ వచ్చే చాన్సుంది. మొత్తంగా కొత్త యేడాది సరికొత్త సినిమాల లుక్స్ అండ్ వీడియోస్ తో హంగామా చేయబోతోందన్నమాట. 

More Related Stories