English   

రంగ‌స్థ‌లం దెబ్బ‌కు అజ్ఞాతంలోకి అజ్ఞాత‌వాసి.. 

Rangasthalam-pawan

రామ్ చ‌ర‌ణ్ క‌సి మొత్తం ఇప్పుడు బ‌య‌ట‌ప‌డుతుంది. ఈయ‌న ఎంత ప్ర‌స్టేజియ‌స్ గా తీసుకుని రంగ‌స్థ‌లం చేసాడో.. ప్రేక్ష‌కులు కూడా అంతే ప్రేమ‌గా ఈ చిత్రాన్ని ద‌గ్గ‌ర‌కు తీసుకున్నారు. 3 గంట‌ల సినిమాను కూడా మ‌క్కువ‌గా చూస్తున్నారు. అస‌లు ఈ మ‌ధ్య కాలంలో ఏ పెద్ద సినిమాకు ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. డిజే.. జై ల‌వ‌కుశ ఇలా ఏ సినిమా తీసుకున్నా కూడా కాస్త నెగిటివ్ టాక్ తోనే జ‌ర్నీ ప్రారంభ‌మైంది. కానీ రంగ‌స్థ‌లంకు మాత్రం సూప‌ర్ పాజిటివ్ టాక్ న‌డుస్తుంది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్ లో అయితే చ‌ర‌ణ్ దెబ్బ‌కు నాన్ బాహుబ‌లి రికార్డుల‌న్నీ తునా తున‌క‌లు అయిపోతున్నాయి. ఇప్ప‌టికే మూడు రోజుల్లోనే 2 మిలియ‌న్ మార్క్ అందుకున్నాడు రామ్ చ‌ర‌ణ్. ఇప్ప‌టి వ‌ర‌కు విదేశాల్లో పెద్ద‌గా క్రేజ్ లేని చ‌ర‌ణ్.. ఇప్పుడు ప‌దేళ్ల బాకీని ఒకేసారి తీర్చేస్తున్నాడు. ఈయ‌న దూకుడు ముందు అజ్ఞాత‌వాసి కూడా త‌ల దించేసింది. ఈ చిత్రం పేరు మీదున్న 2.05 మిలియ‌న్ వ‌సూళ్ల‌ను మూడో రోజే దాటేసి బాబాయ్ ను వెన‌క్కి నెట్టేసాడు చ‌ర‌ణ్. ఇక ఇప్పుడు నాన్న‌కు ప్రేమ‌తో.. ఫిదాతో పాటు అ..ఆ.. ఖైదీ నెం.150 రికార్డుల వైపు అడుగేస్తున్నాడు. శ్రీ‌మంతుడు పేరు మీదున్న 2.8 మిలియ‌న్ రికార్డును కూడా వ‌దిలేలా లేడు రామ్ చ‌ర‌ణ్. ఈయ‌న దూకుడుకు 3 మిలియ‌న్ మార్క్ కూడా వ‌చ్చేలా ఉంది. ఇదే జ‌రిగితే నాన్ బాహుబ‌లిలో 3 మిలియ‌న్ మార్క్ అందుకున్న తొలి చిత్రంగా రికార్డులు సృష్టిస్తాడు మెగా వార‌సుడు. మొత్తానికి చూడాలిక‌.. రంగ‌స్థ‌లం ర‌చ్చ ఇంకెంత కాలం సాగుతుందో ఇలాగే..!

More Related Stories