English   

మెగాస్టార్ ను మించిన మెగాపవర్ స్టార్

Ram-charan-rangasthalam

కొన్ని టైమ్స్ అంతే అలా కలిసొస్తాయి. కొన్ని కథలంటే అలా కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. కానీ రంగస్థలం కలెక్షన్లు చూస్తే ఇది కలెక్షన్ల వర్షం కాదు జడివాన అనిపించక మానదు. ఆ రేంజ్ లో నాలుగు రోజులకే వంద కోట్ల గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించాడీ చిట్టిబాబు. ఫస్ట్ డేకే బెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన రంగస్థలం ఆ తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది. వీక్ డేస్ తర్వాత కూడా కలెక్షన్స్ ఏ మాత్రం డ్రాప్ కావడం లేదు. దీంతో ఇప్పటి వరకూ నాన్ బాహుబలి రికార్డ్ తో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం150ని ఈ రంగస్థలం దాటుతుందనడంలో ఏ డౌట్ లేదు. ఇప్పటికే సినిమా ప్రొడ్యూసర్సే అఫీషియల్ గా తమ సినిమా వంద కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ప్రకటించారు. ఊపు చూస్తోంటే సినిమా నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేయడమే కాదు.. రాబోయే సినిమాలకు సరికొత్త టార్గెట్ కూడా ఇవ్వబోతోందనేది అర్థమౌతూనే ఉంది. 

లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టుగా రామ్ చరణ్ దూకుడుకు బాక్సాఫీస్ షేక్ అవుతోంది. ఇన్నాళ్లూ బాక్సాఫీస్ పై చిరు పంజాలా ఉన్న చరణ్ స్టామినా ఒక్కసారిగా చిరుతలా విరుచుకుపడిందనే చెప్పాలి. స్టార్డమ్ ను కాకుండా కథల్ని నమ్మితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే మన స్టార్స్ కు తెలిసొస్తోంది. ఇన్నాళ్లూ మాస్ స్టోరీస్ తో రచ్చ చేసిన రామ్ చరణ్ ధృవతో కొత్త టర్న్ తీసుకున్నాడు. ఆ టర్న్ తర్వాతే అతనికి ఓవర్శీస్ లో మార్కెట్ ఓపెన్ అయింది. ఇక ఇప్పుడు రంగస్థలంతో అక్కడా ఊపేస్తున్నాడు. 

నిజానికి సినిమాలో ఎన్ని పాత్రలు ఉన్నా.. రామ్ చరణ్  సెంట్రల్ అట్రాక్షన్. మంచి ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నా.. అంతా రామ్ చరణ్ లో ఇన్నాళ్ల తర్వాత కనిపించిన మంచి ఆర్టిస్ట్ నే చూస్తున్నారు. ఒకరకంగా ఇందులో చాలా పాత్రలు ఉన్నా.. సినిమాను భుజాలపై మోసింది చిట్టిబాబే అనడంలో డౌటేలేదు. మొత్తంగా తండ్రిని మించిన తనయుడుగా రికార్డ్ లు క్రియేట్ చేయబోతోన్న రామ్ చరణ్ రాబోయే కాలంలో కూడా కథలనే నమ్మితే ఇలాంటి రిజల్ట్స్ రిపీట్ కావడం పెద్ద కష్టమేం కాదు. 

More Related Stories