English   

రంగస్థలం సెన్సార్ టాక్ ఏంటీ..?

Rangasthalam-Censor

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన రంగస్థలం విడుదలకు అంతా సిద్ధమైంది. ఇవాళ సెన్సార్ కూడా జరుపుకున్న ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ నుంచి పూర్తి పాజిటివ్ టాక్ వచ్చింది. రంగస్థలం నుంచి సెన్సార్ మెంబర్స్ సుకుమార్ తో పాటు ఎంటైర్ టీమ్ ను అద్భుతమైన సినిమా అందిస్తున్నారని అప్రిసియేట్ చేశారు. దీంతో తాము ఇన్నాళ్లు పడ్డ కష్టానికి తగిన రిజల్ట్ రాబోతోందని పూర్తి కాన్ఫిడెంట్ గా ఉంది రంగస్థలం టీమ్. సమంత హీరోయిన్ గా నటించిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతానికి అన్ని వర్గాల నుంచీ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా రంగస్థలంలోని అన్ని పాటలకూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. నిజానికి పాటలే సినిమాకూ మరిన్ని అంచనాలు పెంచాయి.  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రంగస్థలం ఈ నెల 30న  ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. 1980ల నాటి కథాంశం అనేది ఖచ్చితంగా సిల్వర్ స్క్రీన్ పై ఫ్రెష్ లుక్ తెస్తుంది. ఇలాంటి పీరియాడిక్ మూవీస్ తెలుగులో చాలా తక్కువ. ఇక అత్యంత ప్రతిభావంతమైన టెక్నీషియన్స్ పనిచేసిన రంగస్థలం కు ఆర్ట్ వర్క్ హైలెట్ అంటున్నారు. ఇక సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ తో లైన్ క్లియర్ కావడంతో ఇక ఈ శుక్రవారం బాక్సాఫీస్ షేక్ అవుతుందేమో.. 
 

More Related Stories